అయ్యగారు బిజీ..అందుకే అమ్మగారి తనిఖీ
ఆకాశంలో సగం అంటారు. అయితే ఏపీలో ఆ మంత్రిగారి భార్యామణి మాత్రం పదవిలో సగం అని తనకు తాను సూత్రీకరించుకున్నారు. మంత్రిగారితో వెళ్లి గుళ్లు, గోపురాల దగ్గర రాచమర్యాదలు అందుకుంటే.. ఏం మజా ఉందనుకున్నారో ఏమో! నేరుగా ఆమె రంగంలోకి దూకేశారు. ఏకంగా శ్రీకాళహస్తి ఆలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఏపీ అటవీశాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి భార్య బృందమ్మ. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మంత్రి సతీమణి హడావుడికి ఆలయంలో […]
BY sarvi7 Sept 2015 11:47 AM IST
X
sarvi Updated On: 7 Sept 2015 12:50 PM IST
ఆకాశంలో సగం అంటారు. అయితే ఏపీలో ఆ మంత్రిగారి భార్యామణి మాత్రం పదవిలో సగం అని తనకు తాను సూత్రీకరించుకున్నారు. మంత్రిగారితో వెళ్లి గుళ్లు, గోపురాల దగ్గర రాచమర్యాదలు అందుకుంటే.. ఏం మజా ఉందనుకున్నారో ఏమో! నేరుగా ఆమె రంగంలోకి దూకేశారు. ఏకంగా శ్రీకాళహస్తి ఆలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఏపీ అటవీశాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి భార్య బృందమ్మ. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మంత్రి సతీమణి హడావుడికి ఆలయంలో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఏం చేయాలో తెలియక భయంతో వణికి పోయారు. బృందమ్మ ఇలా తనిఖీలు చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో తనిఖీల పేరుతో ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిని పరుగులు పెట్టించారామె. అయితే దీనికి బృందమ్మ ఓ కారణం చెబుతోంది. మంత్రి గారు అధికారిక కార్యక్రమాలలో బిజీగా ఉండడంతో ..తానూ ఈ తనిఖీలు చేపట్టాల్సి వచ్చిందని వివరణ కూడా ఇచ్చారు.
Next Story