మళ్ళీ సోనియాకే అధ్యక్ష పీఠం...
అందరూ ఊహించిన దానికి భిన్నంగా మరో యేడాదిపాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీయే కొనసాగుతారని తెలుస్తోంది. ఈనెల 8న పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక ఇక లాంఛనప్రాయమే. రాహుల్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి ససేమిరా అనడమే దీనికి కారణం. సార్వత్రిక ఎన్నికలలో ఆ తరువాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వరుసగా ఓడిపోవడంతో సోనియా, రాహుల్ గాంధీల ఇమేజ్ బాగా దెబ్బతింది. దీనికి సంబంధించి పార్టీలో అసమ్మతి గళాలను ఏదోవిధంగా అణచివేసిన తరువాత […]
BY sarvi6 Sept 2015 8:33 AM IST
X
sarvi Updated On: 6 Sept 2015 6:30 AM IST
అందరూ ఊహించిన దానికి భిన్నంగా మరో యేడాదిపాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీయే కొనసాగుతారని తెలుస్తోంది. ఈనెల 8న పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక ఇక లాంఛనప్రాయమే. రాహుల్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి ససేమిరా అనడమే దీనికి కారణం. సార్వత్రిక ఎన్నికలలో ఆ తరువాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వరుసగా ఓడిపోవడంతో సోనియా, రాహుల్ గాంధీల ఇమేజ్ బాగా దెబ్బతింది. దీనికి సంబంధించి పార్టీలో అసమ్మతి గళాలను ఏదోవిధంగా అణచివేసిన తరువాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేప్పట్టడానికి సిద్దపడ్డారు. అప్పుడు షీలా దీక్షిత్, జైరామ్ రమేష్ వంటి సీనియర్ నేతలే రాహుల్ కి ‘అంత సీన్ లేదని’ చెప్పడంతో, రాహుల్ బాగా హర్ట్ అయ్యి, ఓ రెండు నెలలు కనిపించకుండా పోయారు. తర్వాత తనను తాను అన్ని విధాలా తీర్చిదిద్దుకున్నట్టు కనిపించినా పార్టీ అధ్యక్ష పదవి చేప్పట్టేందుకు రాహుల్ గాంధీ సిద్దంగా లేరని కాంగ్రెస్ చెబుతోంది. అయితే ఇది పార్టీ నిర్ణయమా లేక రాహుల్ నిర్ణయమా అన్నది అంతుబట్టని ప్రశ్న. ఏకంగా ప్రధానమంత్రి పదవినే చేపట్టాలనుకొన్న రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షపదవి చేపట్టడానికి కూడా ఎందుకు జంకుతున్నారు? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీయే జవాబు చెప్పవలసి ఉంటుంది. మొత్తం మీద బాధ్యతల నుంచి తప్పుకుందామనుకున్నా సోనియాగాంధీకి కుదిరేట్టు లేదు. మరో యేడాదిపాటు ఆమే పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగవలసిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
Next Story