కోదండరాం కొత్త జేఏసీ
తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం మరో కొత్త జేఏసీ ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. తెలంగాణ సాధన కోసం ఏర్పాటు చేసిన ఐక్యకార్యాచరణ కమిటీ ..తెలంగాణ సాధనతో అంతగా ప్రాధాన్యం లేని జేఏసీగా మిగిలిపోయింది. అయితే పోరాటమే ఊపిరిగా జీవితాన్ని గడుపుతున్న ప్రొఫెసర్ కోదండరాం.. తెలంగాణలో తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న రైతుల తరఫున పోరాడేందుకు నిర్ణయించుకున్నారు. మూడు దశాబ్దాలుగా సమస్యలతో సతమతమవుతున్న అన్నదాతల పక్షాన పోరాడాల్సిన తక్షణ అవసరం ఉందని కోదండరాం అంటున్నారు. అందుకే రైతు […]
BY admin6 Sept 2015 1:46 AM IST

X
admin Updated On: 6 Sept 2015 1:46 AM IST
తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం మరో కొత్త జేఏసీ ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. తెలంగాణ సాధన కోసం ఏర్పాటు చేసిన ఐక్యకార్యాచరణ కమిటీ ..తెలంగాణ సాధనతో అంతగా ప్రాధాన్యం లేని జేఏసీగా మిగిలిపోయింది. అయితే పోరాటమే ఊపిరిగా జీవితాన్ని గడుపుతున్న ప్రొఫెసర్ కోదండరాం.. తెలంగాణలో తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న రైతుల తరఫున పోరాడేందుకు నిర్ణయించుకున్నారు. మూడు దశాబ్దాలుగా సమస్యలతో సతమతమవుతున్న అన్నదాతల పక్షాన పోరాడాల్సిన తక్షణ అవసరం ఉందని కోదండరాం అంటున్నారు. అందుకే రైతు సమస్యలపై పోరాడేందుకు త్వరలో మరో జేఏసీ ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో కోదండరాం మాట్లాడారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు విలవిల్లాడుతున్నారని, తక్షణమే ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story