ముగ్గురిలో నాని గెలిచాడు...
గత శుక్రవారం ముగ్గురు యువ హీరోలు ఆడియన్స్ తీర్పు కోసం వచ్చారు. యువ హీరో నానీ భలే భలే మగాడివోయ్ అంటూ వస్తే.. హీరో విశాల్.. జయసూర్య యాక్షన్ ప్యాక్ తో వచ్చాడు.. ఇక డైనమైట్ అంటూ విష్ణు యాక్షన్ థ్రిల్లర్ తొ ఆడియన్స్ ముందుకు వచ్చారు. అయితే ముగ్గురిలో హీరో నాని హిట్ అనిపించుకున్నాడు. డైరెక్టర్ మారుతి , హీరో నాని కాంబినేషన్ లో వచ్చిన భలే భలే మగాడివోయ్, […]
BY sarvi6 Sept 2015 12:34 AM IST
X
sarvi Updated On: 6 Sept 2015 8:54 AM IST
గత శుక్రవారం ముగ్గురు యువ హీరోలు ఆడియన్స్ తీర్పు కోసం వచ్చారు. యువ హీరో నానీ భలే భలే మగాడివోయ్ అంటూ వస్తే.. హీరో విశాల్.. జయసూర్య యాక్షన్ ప్యాక్ తో వచ్చాడు.. ఇక డైనమైట్ అంటూ విష్ణు యాక్షన్ థ్రిల్లర్ తొ ఆడియన్స్ ముందుకు వచ్చారు. అయితే ముగ్గురిలో హీరో నాని హిట్ అనిపించుకున్నాడు. డైరెక్టర్ మారుతి , హీరో నాని కాంబినేషన్ లో వచ్చిన భలే భలే మగాడివోయ్, క్లీన్ కామెడి చిత్రంగా అలరిస్తుంది. సాధారణంగా కామెడి బేస్ తో వచ్చే చిత్రం వాణిజ్య పరంగా సేఫ్ గా వుంటాయి. ఇక గుర్తింపు వున్న హీరోలకు కామెడి చిత్రం పడితే హండ్రెట్ పర్సెంట్ విజయం సాధిస్తుంది. నానీ తొలి సారిగా చేసిన కామెడి ప్రయత్నం విజయం వంతం అయ్యింది. వాస్తవంగా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న నానికి భలే భలే మగాడివోయ్ నేర వెర్చిందని చెప్పాలి.
ఇక డైనమైట్ చిత్రం ఒక వర్గం ఆడియన్స్ కే పరిమితం అయ్యింది. యాక్షన్ థ్రిల్లర్ గా మంచి ప్రయత్నం చేశారు. అయితే వినోదం, సెంటిమెంట్స్ పెద్దగా లేకుండా చేశారు. ఇది ఒకింత సినిమాకు మైనస్ అయ్యింది. అయినప్పటికి నాట్ బ్యాడ్ అనిపించుకుని నానీ, తరువాత సెకండ్ హిట్ డైనమైట్ అనిపించుకుంది. ఇక పందేం కోడి తరువాత ఆ స్థాయి హిట్ కు ట్రై చేస్తున్న విశాల్ కు జయసూర్య చిత్రం పూర్తి ఫలితాన్ని ఇవ్వలేదనే చెప్పాలి.
Next Story