పటేళ్ల దండియాత్ర 13కు వాయిదా
పటేళ్లకు ఓబీసీ కోటాలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఆదివారం నిర్వహించ తలపెట్టిన రివర్స్ దండి మార్చ్ ఆందోళనకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఆ కార్యక్రమాన్ని ఈ నెల 13కు వాయిదా వేసినట్లు పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి(పాస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ తెలిపారు. అయితే 13న ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా యాత్ర నిర్వహించి తీరుతామని హార్దిక్ పటేల్ హెచ్చరించారు. తాము శాంతియుతంగా ఆందోళన చేపడితే ప్రభుత్వం అనవసరమైన రాద్దాంతం చేస్తోందని, రిజర్వేషన్లను ఇష్టారీతిగా అమలు చేస్తే […]
BY sarvi5 Sept 2015 6:39 PM IST
X
sarvi Updated On: 6 Sept 2015 7:23 AM IST
పటేళ్లకు ఓబీసీ కోటాలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఆదివారం నిర్వహించ తలపెట్టిన రివర్స్ దండి మార్చ్ ఆందోళనకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఆ కార్యక్రమాన్ని ఈ నెల 13కు వాయిదా వేసినట్లు పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి(పాస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ తెలిపారు. అయితే 13న ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా యాత్ర నిర్వహించి తీరుతామని హార్దిక్ పటేల్ హెచ్చరించారు. తాము శాంతియుతంగా ఆందోళన చేపడితే ప్రభుత్వం అనవసరమైన రాద్దాంతం చేస్తోందని, రిజర్వేషన్లను ఇష్టారీతిగా అమలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. రిజర్వేషన్లను క్రమబద్దీకరించాలని లేదా హేతుబద్దత లేని రిజర్వేషన్లను ఎత్తివేయాలని ఆయన డిమాండు చేశారు.
Next Story