ఆ అస్థికలు షీనావే!
షీనాబోరా హత్య కేసు కొలిక్కి వచ్చే దిశగా సాగుతోంది. రాయగడ్‌లోని హత్య జరిగిన స్థలంలో పోలీసులు సేకరించిన షీనాబోరా అవశేషాలను ఇప్పటికే ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపిన సంగతి తెలిసిందే! ఈ పరీక్షల ఫలితాలు పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చేవిగా ఉండటం గమనార్హం. పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన పుర్రెను డిజిటల్ ఫేసియల్ సూపర్ ఇంపొజిషన్ ద్వారా పూర్వరూపం కల్పించగా.. అది షీనా ముఖానికి దగ్గర పోలికలతో ఉండటం విశేషం. అంతేకాదు. ఆ అస్థికలు యువతివి అని, […]
BY sarvi6 Sept 2015 9:08 AM IST
X
sarvi Updated On: 6 Sept 2015 9:08 AM IST
షీనాబోరా హత్య కేసు కొలిక్కి వచ్చే దిశగా సాగుతోంది. రాయగడ్‌లోని హత్య జరిగిన స్థలంలో పోలీసులు సేకరించిన షీనాబోరా అవశేషాలను ఇప్పటికే ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపిన సంగతి తెలిసిందే! ఈ పరీక్షల ఫలితాలు పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చేవిగా ఉండటం గమనార్హం. పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన పుర్రెను డిజిటల్ ఫేసియల్ సూపర్ ఇంపొజిషన్ ద్వారా పూర్వరూపం కల్పించగా.. అది షీనా ముఖానికి దగ్గర పోలికలతో ఉండటం విశేషం. అంతేకాదు. ఆ అస్థికలు యువతివి అని, చనిపోయిన సమయంలో ఆమె వయసు 20-25 ఏళ్ల ఉండవచ్చని (హత్య సమయంలో షీనా వయసు 24), ఎత్తు 154-160 సెంటిమీటర్లు ఉందని అగ్రిపడ్‌లోని బీవైఎల్ నాయర్ హాస్పిటల్ నివేదిక వెల్లడించింది. దీంతో పోలీసుల చేతిలో తిరుగులేని ఆయుధాలు పడ్డట్లయింది. ఇప్పటికే ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యాంవర్ రాయ్ నేరాన్ని అంగీకరించారు. ఇక డీఎన్ ఏ పరీక్ష ఒక్కటే మిగిలి ఉంది. అది కూడా పూర్తయితే.. ఇంద్రాణి తప్పించుకోవడానికి సాంకేతికంగా ఎలాంటి అవకాశాలు ఉండే పరిస్థితి లేదు.
మిఖాయిల్‌నూ అనుమానించారా?
షీనా బోరా హత్య కేసులో మొదటి నుంచి ఆమె సోదరుడు మిఖాయిల్‌ను అనుమానిస్తూ వచ్చారు. ఆమె సోదరి అదృశ్యమై మూడేళ్లయినా అతను మిన్నకుండటం, ఇంద్రాణి బ్యాంకు ఖాతా నుంచి మిఖాయిల్ ఖాతాకు ప్రతినెల రూ.40,0000 – రూ.50,000 పంపుతుండటంతో పోలీసులు మిఖాయిల్‌నూ అనుమానించారు. కానీ, విదేశాల నుంచి షీనా నుంచి ఈ-మెయిల్ రావడంతో మిఖాయిల్ తన చెల్లెలు అమెరికాలో క్షేమంగానే ఉందని అనుకున్నాడని నిర్ధారణకు వచ్చారు. అలాగే విదేశాల నుంచి షీనా పేరు మీదుగా వచ్చిన ఈ-మెయిళ్లన్నీ ఇంద్రాణీ సృష్టించినవేనని పోలీసులు తేల్చారు. ఇందులో రెండు మిఖాయిల్‌కు రెండు పీటర్‌కు, రెండు విధికి వచ్చినట్లుగా గుర్తించారు. దీంతో ఈ కేసులో ఇంద్రాణి ప్రస్తుత భతర్త పీటర్ ముఖర్జియాకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
Next Story