Telugu Global
Others

Wonder World 17

మైక్రోస్కోపులో కెఫీన్‌! కప్పు కాఫీ పడనిదే రోజు ప్రారంభం కాదు చాలా మందికి. కానీ కాఫీలో చాలా విషతుల్యమైన కెఫీన్‌ అనే పదార్ధం ఉందని చాలా మందికి తెలియదు. కాఫీకి బానిసలుగా మారిపోయినవారు ఈ వాదనను కొట్టిపడేస్తుంటారు కూడా. కప్పు కాఫీలో 100 మిల్లీ గ్రాముల కెఫీన్‌ ఉంటుందని అంచనా. ఈ కెఫీన్‌ను సూక్ష్మదర్శినిలో చూస్తే ఇలా రంగురంగుల అందమైన గడ్డి మాదిరిగా కనిపిస్తుందట. ———————————————————————————————————— షాక్‌ తింటే లెక్కలు గడగడా! కరెంట్‌ షాక్‌ మంచిదేలే అని సెలవిస్తుంటారు చాలామంది. […]

Wonder World 17
X

మైక్రోస్కోపులో కెఫీన్‌!

coffie
కప్పు కాఫీ పడనిదే రోజు ప్రారంభం కాదు చాలా మందికి. కానీ కాఫీలో చాలా విషతుల్యమైన కెఫీన్‌ అనే పదార్ధం ఉందని చాలా మందికి తెలియదు. కాఫీకి బానిసలుగా మారిపోయినవారు ఈ వాదనను కొట్టిపడేస్తుంటారు కూడా. కప్పు కాఫీలో 100 మిల్లీ గ్రాముల కెఫీన్‌ ఉంటుందని అంచనా. ఈ కెఫీన్‌ను సూక్ష్మదర్శినిలో చూస్తే ఇలా రంగురంగుల అందమైన గడ్డి మాదిరిగా కనిపిస్తుందట.
————————————————————————————————————
షాక్‌ తింటే లెక్కలు గడగడా!

power
కరెంట్‌ షాక్‌ మంచిదేలే అని సెలవిస్తుంటారు చాలామంది. అది నిజమేనట. కరెంట్‌ షాక్‌ తిన్నవారు గణితంలో మెరుగవుతారని అధ్యయనాలలో తేలింది. ఒక బల్బు వెలిగించడానికి అవసరమయ్యేంత కరెంట్‌ మెదడులోకి ప్రసరిస్తే ఆరునెలలు తిరక్కుండానే గణితంలో సామర్థ్యం బాగా పెరుగుతుందట.
————————————————————————————————————
కెనడీకి లేఖ రాసిన చిన్నారి

kenidian
1961లో నాటి అమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నడీకి ఓ ఎనిమిదేళ్ల చిన్నారి నుంచి ఓ ఉత్తరం అందింది. ఆ ఉత్తరం సారాంశమేమిటంటే.. సోవియట్‌ వారు అణుబాంబులు పరీక్షిస్తున్నందున వాటిలో శాంతాక్లాజ్‌ గాయపడతాడేమోనని భయంగా ఉన్నదని ఆ పాప రాసింది. శాంతాక్లాజ్‌తో తాను మాట్లాడానని, ఆయన క్షేమంగానే ఉన్నాడని, భయపడాల్సిందేమీ లేదని కెన్నడీ ఆ పాపకు తిరిగి ఉత్తరం రాశాడట.

First Published:  4 Sept 2015 6:34 PM IST
Next Story