కర్నూలు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ధర్మాపేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం మధ్యాహ్నం ఓ ఇంటిలో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాద సమయంలోనే ఓ గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఇంటిలో ఎవరూ లేనందువల్ల ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. ఈ ప్రమాదంలో 25 ఇళ్ళు దగ్ధమై పోయాయి. ఇళ్ళల్లో ఉన్న సామాగ్రిని ఎవరూ తీసుకోలేక పోయారు. దాంతో బాధితులంతా బోరున విలపిస్తున్నారు. కూలీనాలీ చేసుకుని బతుకు వెళ్ళదీసే తమకు వచ్చిన ఇలాంటి […]
BY sarvi5 Sept 2015 9:07 AM IST

X
sarvi Updated On: 5 Sept 2015 9:07 AM IST
కర్నూలు జిల్లా ధర్మాపేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం మధ్యాహ్నం ఓ ఇంటిలో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాద సమయంలోనే ఓ గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఇంటిలో ఎవరూ లేనందువల్ల ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. ఈ ప్రమాదంలో 25 ఇళ్ళు దగ్ధమై పోయాయి. ఇళ్ళల్లో ఉన్న సామాగ్రిని ఎవరూ తీసుకోలేక పోయారు. దాంతో బాధితులంతా బోరున విలపిస్తున్నారు. కూలీనాలీ చేసుకుని బతుకు వెళ్ళదీసే తమకు వచ్చిన ఇలాంటి కష్టంలో ఆదుకునే వారు ఎవరుంటారని బాధితులు బాధపడుతున్నారు. ఇళ్ళన్నీ బూడిదై పోవడంతో పిల్లాపాపలతో అందరూ రోడ్డున పడ్డారు.
Next Story