Telugu Global
Others

ఐరోపా దేశాలకు కనువిప్పు కలిగించిన 'చిన్నారి'

ముక్కుపచ్చలారని పిల్లాడు. నిండా మూడేళ్ల వయసు. ఆ సిరియా చిన్నోడు జీవచ్ఛవంగా మారి ప్రపంచాన్ని కదిలించాడు. యూరప్ దేశాల చెంప ఛెళ్లు మనిపించాడు. తాను చనిపోయినా.. లక్షలాది మంది శరణార్థులకు మార్గం చూపాడు. ఆయాన్ కుర్దీ మరణం తర్వాత వలసదారులను రానిచ్చేందుకు ముందుకొచ్చాయి యూరోప్ దేశాలు. అలాగే.. శరణార్ధులను ఆదుకునేందుకు ద చారిటీ ఫర్ మైగ్రెంట్ ఆఫ్ షోర్ అనే స్వచ్ఛంద సంస్థకు సుమారు నాలుగున్నర కోట్ల రూపాయల విరాళాలు అందాయి.  సోషల్‌ మీడియాలోను, ఇంటర్నేషనల్ మీడియాలోను […]

ఐరోపా దేశాలకు కనువిప్పు కలిగించిన చిన్నారి
X
ముక్కుపచ్చలారని పిల్లాడు. నిండా మూడేళ్ల వయసు. ఆ సిరియా చిన్నోడు జీవచ్ఛవంగా మారి ప్రపంచాన్ని కదిలించాడు. యూరప్ దేశాల చెంప ఛెళ్లు మనిపించాడు. తాను చనిపోయినా.. లక్షలాది మంది శరణార్థులకు మార్గం చూపాడు. ఆయాన్ కుర్దీ మరణం తర్వాత వలసదారులను రానిచ్చేందుకు ముందుకొచ్చాయి యూరోప్ దేశాలు. అలాగే.. శరణార్ధులను ఆదుకునేందుకు ద చారిటీ ఫర్ మైగ్రెంట్ ఆఫ్ షోర్ అనే స్వచ్ఛంద సంస్థకు సుమారు నాలుగున్నర కోట్ల రూపాయల విరాళాలు అందాయి.
సోషల్‌ మీడియాలోను, ఇంటర్నేషనల్ మీడియాలోను ఈ విషయంపై దుమారం రేగడంతో.. అన్ని దేశాలు భుజాలు తడుముకున్నాయి. ఎందుకంటే… ఈ పాపం యూరోపియన్ దేశాలన్నింటిదీ. సిరియా, లిబియాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాల నుంచి బయటపడేందుకు లక్షలాది మంది సొంత గడ్డను వదిలి వలసపోతున్నారు. వారు తమ దేశంలోకి రాకుండా అన్ని దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా శరణార్థులకు షెల్టర్ కల్పిస్తే ఈ బాలుడి మరణం ఆగేది.. పాపం పసివాడు తన ప్రాణం బలిస్తే కాని యూరప్ దేశాలు కళ్లు తెరుచుకోలేకపోయాయి.. అయినా అభం శుభం తెలియని పసిబాలుడే అయినా.. తాను ప్రాణాలు విడుస్తూ.. ఎందరికో కనువిప్పు కలిగించాడు.
First Published:  5 Sept 2015 10:00 AM IST
Next Story