Telugu Global
Others

1300 కోట్లతో ఈ-ప్రగతి ప్రాజెక్టు: సీఎం చంద్రబాబు

ఈ-ప్రగతి ప్రాజెక్టుకు రూ. 1300 కోట్లతో రూపకల్పన చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రజలకు అందుతున్న సేవలను సరళం చేసేందుకు ఈ-ప్రగతి ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ -ప్రగతితో 77 శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఏపీ, సింగపూర్‌ ప్రభుత్వం, విప్రో కంపెనీ సంయుక్త భాగస్వామ్యంతో ఈ-ప్రగతి ప్రాజెక్టును నిర్వహిస్తాయని సీఎం స్పష్టం చేశారు. దాదాపు మూడున్నర గంటలపాటు సాగిన ఆంద్రప్రదేశ్‌ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. వ్యవసాయానికి పగటిపూట నిరంతరంగా […]

1300 కోట్లతో ఈ-ప్రగతి ప్రాజెక్టు: సీఎం చంద్రబాబు
X
ఈ-ప్రగతి ప్రాజెక్టుకు రూ. 1300 కోట్లతో రూపకల్పన చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రజలకు అందుతున్న సేవలను సరళం చేసేందుకు ఈ-ప్రగతి ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ -ప్రగతితో 77 శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఏపీ, సింగపూర్‌ ప్రభుత్వం, విప్రో కంపెనీ సంయుక్త భాగస్వామ్యంతో ఈ-ప్రగతి ప్రాజెక్టును నిర్వహిస్తాయని సీఎం స్పష్టం చేశారు. దాదాపు మూడున్నర గంటలపాటు సాగిన ఆంద్రప్రదేశ్‌ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. వ్యవసాయానికి పగటిపూట నిరంతరంగా ఏడు గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలని ఈ భేటీలో నిర్ణయించారు. అదే విధంగా అమరావతికి వివిధ శాఖల కార్యాలయాల తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, తద్వారా సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి రావాలని కేబినెట్‌ తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కి విశాఖ, కాకినాడ, అనంతపురంలో భూ కేటాయింపు తదితర అంశాలను కూడా కేబినెట్‌ సమావేశంలో చర్చించారు. మచిలీపట్నం పోర్టు భూ కేటాయింపులపైనా చర్చ జరిగింది. ఈ పోర్టుకు 16 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండగా అదనంగా మరో 14 వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా భూ సమీకరణ చేయాలని, అవసరమైతే వారి అభిప్రాయాలకు అనుగుణంగా భూములు సమీకరించాలని కేబినెట్‌ నిర్ణయించింది.
First Published:  5 Sept 2015 11:12 AM IST
Next Story