మూడ్రోజుల్లో 25 మంది అన్నదాతల ఆత్మహత్య!
రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాడెద్దులకు గ్రాసం కొనలేక… కన్నబిడ్డలోలే సాకిన పంటలు కళ్ళ ముందే ఎండుతుంటే తట్టుకోలేక… సాగుకోసం తెచ్చిన అప్పులు తీర్చేందుకు మనసు చంపుకుని నమ్ముకున్న భూములనమ్మినా వడ్డీలకే సరిపోక… ఇక ఆ రుణాలు తీర్చే మార్గం కానరాక… శుక్రవారం ఒక్కరోజే ఏడుగురు రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. మరో రైతు గుండెపోటుతో చనిపోయాడు. ఇంకో రైతు ఆత్మహత్యాయత్నం చేసుకోగా అతని పరిస్థితి విషమంగా ఉంది. మృతిచెందిన వారిలో ఐదుగురు కౌలు రైతులున్నారు. మహబూబ్‌నగర్‌లో […]
BY admin5 Sept 2015 3:23 AM IST
X
admin Updated On: 5 Sept 2015 3:23 AM IST
రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాడెద్దులకు గ్రాసం కొనలేక… కన్నబిడ్డలోలే సాకిన పంటలు కళ్ళ ముందే ఎండుతుంటే తట్టుకోలేక… సాగుకోసం తెచ్చిన అప్పులు తీర్చేందుకు మనసు చంపుకుని నమ్ముకున్న భూములనమ్మినా వడ్డీలకే సరిపోక… ఇక ఆ రుణాలు తీర్చే మార్గం కానరాక… శుక్రవారం ఒక్కరోజే ఏడుగురు రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. మరో రైతు గుండెపోటుతో చనిపోయాడు. ఇంకో రైతు ఆత్మహత్యాయత్నం చేసుకోగా అతని పరిస్థితి విషమంగా ఉంది. మృతిచెందిన వారిలో ఐదుగురు కౌలు రైతులున్నారు. మహబూబ్‌నగర్‌లో నలుగురు, కరీంనగర్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. రాష్ట్రంలో బుధవారం 8 మంది, గురువారం 10 మంది రైతులు చనిపోయిన విషయం విదితమే. అందిన సమాచారం మేరకు రాష్ట్రంలో మూడ్రోజుల్లో 25 మంది రైతులు మృతి చెందారు. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ రైతుల ఆత్మహత్యలు నమోదవుతున్నా ప్రభుత్వం అటువైపు దృష్టి పెట్టడం లేదని విపక్ష పార్టీలన్నీ టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి.
Next Story