టీఆర్‌ఎస్‌పై కలిసి ఫైట్ చేస్తాం: టీటీడీపీ, బీజేపీ
అభ్యర్థుల ఎంపికతో సంబంధం లేకుండా ఉప ఎన్నికల్లో ఉమ్మడిగా ప్రచారం చేయాలని, తెలంగాణా తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలు నిర్ణయించాయి. రానున్న వరంగల్ లోకసభ, అసెంబ్లీ ఉపఎన్నికల్లో విజయం సాధించేందుకు టీడీపీ, బీజేపీలు ఇప్పటి నుంచే ఉమ్మడిగా ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సంయుక్తంగా పోరాటం చేయాలని తీర్మానించుకున్నాయి. ఇందుకు ఒక కార్యాచరణను కూడా రూపొందించుకున్నాయి. టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దయాకర్‌రావుతోపాటు బీజేపీ రాష్ట్ర […]
BY sarvi4 Sept 2015 9:08 AM IST
X
sarvi Updated On: 4 Sept 2015 9:08 AM IST
అభ్యర్థుల ఎంపికతో సంబంధం లేకుండా ఉప ఎన్నికల్లో ఉమ్మడిగా ప్రచారం చేయాలని, తెలంగాణా తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలు నిర్ణయించాయి. రానున్న వరంగల్ లోకసభ, అసెంబ్లీ ఉపఎన్నికల్లో విజయం సాధించేందుకు టీడీపీ, బీజేపీలు ఇప్పటి నుంచే ఉమ్మడిగా ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సంయుక్తంగా పోరాటం చేయాలని తీర్మానించుకున్నాయి. ఇందుకు ఒక కార్యాచరణను కూడా రూపొందించుకున్నాయి. టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దయాకర్‌రావుతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఉమ్మడిగా ఈ విషయం వెల్లడించారు. ఉప ఎన్నికల్లో ఉమ్మడిగా ప్రచారం చేస్తామన్నారు. అభ్యర్ధుల ఖరారును బీజేపీ జాతీయ నాయకత్వం, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు చూసుకుంటారన్నారు. దయాకర్‌రావు మట్లాడుతూ రానున్న వరంగల్ పార్లమెంట్ స్థానంతోపాటు గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లు, సనత్‌నగర్, నారాయణఖేడ్‌తోపాటు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన వలసవాద ఎమ్మెల్యేపై పడే వేటు వల్ల ఖాళీ అయ్యే అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తమ రెండు పార్టీలూ కలిసి పని చేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నామని చెప్పారు. రెండు పార్టీల నుంచి ముగ్గురేసి సీనియర్ నాయకులతో కమిటీలను వేయనున్నట్టు తెలిపారు. కంతనపల్లి ప్రాజెక్టు వరకు పాదయాత్ర చేయకుండా కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండించారు.
Next Story