హెల్మెట్ లేకుంటే జరిమానా రూ.1000
ఇక హెల్మెట్ లేకపోతే వాహనదారులు వెయ్యి రూపాయలు జరిమానా కట్టాల్సిందే. ఈ నిబంధన ఇప్పటికే అమల్లోకి వచ్చింది. శుక్రవారం నుంచి తప్పనిసరిగా హెల్మెట్ వాడాలన్న నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ రవాణ శాఖ నిర్ణయించింది . ఎపిలో కూడా ఇలాంటి నిబంధన పెట్టినా, దానిని అమలు చేయడాన్ని మూడు నెలలపాటు వాయిదా వేశారు. వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా కొనుగోలు చేయాలన్న నిబంధనను విధించారు. లేకుంటే రిజిస్ట్రేషన్ జరగదన్న నిబంధనను పెట్టారు. దీనికి పెద్దగా […]
BY sarvi4 Sept 2015 3:54 AM GMT
X
sarvi Updated On: 4 Sept 2015 4:58 AM GMT
ఇక హెల్మెట్ లేకపోతే వాహనదారులు వెయ్యి రూపాయలు జరిమానా కట్టాల్సిందే. ఈ నిబంధన ఇప్పటికే అమల్లోకి వచ్చింది. శుక్రవారం నుంచి తప్పనిసరిగా హెల్మెట్ వాడాలన్న నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ రవాణ శాఖ నిర్ణయించింది . ఎపిలో కూడా ఇలాంటి నిబంధన పెట్టినా, దానిని అమలు చేయడాన్ని మూడు నెలలపాటు వాయిదా వేశారు. వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా కొనుగోలు చేయాలన్న నిబంధనను విధించారు. లేకుంటే రిజిస్ట్రేషన్ జరగదన్న నిబంధనను పెట్టారు. దీనికి పెద్దగా ఇబ్బంది లేకపోయినా వాహనదారులు హెల్మెట్ వాడకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధించాలన్న నిర్ణయానికి మాత్రం సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం పోలీసులలో అవినీతిని పెంచే ఆస్కారం ఉంటుంది. హెల్మెట్‌లు ధరించడం మంచిదే. కాని దాని కోసం భారీ జరిమానాలు వేయాలన్న ఆలోచన ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొన్నాళ్ళపాటు ఈ నిబంధనను సడలించాలని టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
Next Story