Telugu Global
Cinema & Entertainment

జయసూర్య మూవీ రివ్యూ

రేటింగ్ : 2.5/5 విడుదల తేదీ : 04 సెప్టెంబర్ 2015 ద‌ర్శకత్వం : సుశీంద్రన్ నిర్మాత : జి. నాగేశ్వర్ రెడ్డి – ఎస్. నరసింహ ప్రసాద్ సంగీతం : డి. ఇమాన్ నటీనటులు : విశాల్, కాజల్ అగర్వాల్, సముద్రఖని, సూరి.. పందేం కోడి చిత్రంతో  తెలుగు నాట  గ్రాండ్ గా ప‌రిచ‌యం అయిన  హీరో  విశాల్.  తెలుగు అబ్బాయి అయిన‌ప్ప‌టికి చెన్నై లో సెటిల్ కావ‌డం తో..  కోలీవుడ్ హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. […]

జయసూర్య మూవీ రివ్యూ
X

రేటింగ్ : 2.5/5
విడుదల తేదీ : 04 సెప్టెంబర్ 2015
ద‌ర్శకత్వం : సుశీంద్రన్
నిర్మాత : జి. నాగేశ్వర్ రెడ్డి – ఎస్. నరసింహ ప్రసాద్
సంగీతం : డి. ఇమాన్
నటీనటులు : విశాల్, కాజల్ అగర్వాల్, సముద్రఖని, సూరి..

పందేం కోడి చిత్రంతో తెలుగు నాట గ్రాండ్ గా ప‌రిచ‌యం అయిన హీరో విశాల్. తెలుగు అబ్బాయి అయిన‌ప్ప‌టికి చెన్నై లో సెటిల్ కావ‌డం తో.. కోలీవుడ్ హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. అయితే విశాల్ ప్ర‌తి సినిమా త‌మిళ్ తో పాటు ..తెలుగులో రిలీజ్ అవుతుంటాయి. అలా తాజాగా సుసీంద్ర‌న్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన జ‌య‌సూర్య ఒక ప్రామిసింగ్ ఫిల్మ్ అన్నారు చిత్ర యూనిట్. ఎంత వ‌ర‌కు వాళ్ల ప్రామిస్ ను నిలుపుకున్నారో చూద్దాం….

కథ :
క‌థ ప‌రంగా జ‌య‌సూర్య కొత్తదేమి కాదు. ఒక రౌడి గ్యాంగ్. రిచ్ బిజినెస్ మెన్ ల్ని టార్గెట్ చేసి బెదిరించి డ‌బ్బు వ‌సూలు చేస్తుంటారు. మాట విన‌క పోతే చంపేస్తుంటారు. వీళ్ల ఆగ‌డాల్ని అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన పోలీసాఫ‌స‌ర్ ను దారుణంగా చంపేస్తారు. డ‌బ్బులు వ‌సూలు చేసే రౌడి గ్యాంగ్ కు భ‌వానీ అనేవాడు నాయ‌కుడు. వీడిని..వీడి గ్యాంగ్ ను ప‌ట్టుకోవ‌డానికి స్పెష‌ల్ ఆఫీస‌ర్ గా అసిస్టెంట్ పోలీస్ క‌మిష‌న‌ర్ జ‌య‌సూర్య ను అపాయింట్ చేస్తారు. ఈ గ్యాంగ్ ను మ‌ట్టు బెట్టిన త‌రువాత జ‌య‌సూర్య కు మ‌రో బిగ్ గ్యాంగ్ స్ట‌ర్ ఎదుర‌వుతాడు. జ‌య‌సూర్య ప‌ట్టుకున్న ఎవిడెన్స్ అన్నింటిని మాయం చేస్తుంటారు. అప్పుడే కథలోకి శ్రీను(సముద్రఖని..శంబో శివ‌శంబో చిత్రం డైరెక్ట‌ర్‌) ఎంటర్ అవుతాడు. అసలు ఈ శ్రీను ఎవరు.? ఈ కథకి, జయసూర్యకి శ్రీనుకి ఉన్న సంబంధం ఏమిటి అనేదే కథలో అసలైన ట్విస్ట్.? ఆ ట్విస్ట్ ఏంటి.? దొరికిన సాక్ష్యాలన్నీ మిస్ అవుతున్నా చివరికి జయసూర్య ఎలా భవాని వెనకున్నగ్యాంగ్ ని పట్టుకొని మట్టుపెట్టాడు అన్నదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

జయసూర్య సినిమాకి మొదటి ప్లస్ పాయింట్ అంటే డైరెక్టర్ అనుకున్న స్టొరీ లైన్. ఒకే ప్లేస్ నుంచి హీరోయిజం మరియు విలనిజంని డెవలప్ చేస్తూ, దానికి సెంటిమెంట్ అనే పాయింట్ ని మిక్స్ చేసి చెప్పడం చాలా బాగుంది. ఆ స్టొరీ లైన్ లోని స్ట్రాంగ్ నెస్ సినిమాలో చాలా సీన్స్ లో కనపడి ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇక సినిమా పరంగా చెప్పాలనుకుంటే విలన్ ని రివీల్ చేసే ఇంటర్వల్ బ్లాక్ బాగుంది. ఇక సెకండాఫ్ లో హీరో – విలన్ మధ్య జరిగే కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ చాలా బాగున్నాయి. సెకండాఫ్ లో విశాల్ వేసే ఓ పోలీస్ ప్లాన్, క్లైమాక్స్ లో సస్పెన్స్ రివీల్ చేసే సీన్స్ బాగున్నాయి.

న‌టీ న‌టుల ప‌నితీరు..
హీరో విశాల్ ఎక్కువుగా యాక్ష‌న్ క‌థ‌ల్నే ఎంచుకుంటాడు. వాస్తవం చెప్పుకుంటే.. విశాల్ కు యాక్ష‌న్ క‌థ‌లే బాగా సూటు అవుతాయి. కామెడి క‌థ‌లు అంత‌గా చేయ‌లేడు. వేరే విధంగా ప్ర‌య‌త్నించి చేసిన క‌థ‌ల‌తో విశాల్ పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. తాజాగా జ‌య‌సూర్య చిత్రం కూడా విశాల్ లో యాక్ష‌న్ కొణాల్ని బ‌య‌ట‌కు తీసింద‌నే చెప్పాలి. ఇన్విస్టెగేటివ్ ఆఫీస‌ర్ గా విశాల్ పాత్ర బాగానే మెప్పించాడు. అవ‌కాశం వుంటే యాక్టింగ్ ప‌రంగా స‌త్తా చాట‌గ‌ల న‌టి కాజ‌ల్. డైరెక్ట‌ర్ సుసీంద్ర‌న్ గ‌తంలో కార్తీతో చేసిన నా పేరు శివ‌ చిత్రంలో కాజ‌ల్ కు మంచి రోల్ ఇచ్చాడు. జ‌య‌సూర్య లో మాత్రం గ్లామ‌ర్ డాల్ గానే చూపించాడు. పెద్ద‌గా యాక్టింగ్ కు స్కోప్ లేదు. ఇక ఈ చిత్రంలో మ‌రో ప్రామిసింగ్ యాక్ట‌ర్ సుమ‌ద్ర‌ఖ‌ని. రెండు డిఫ‌రెండ్ షేడ్స్ వున్న రోల్ ను స‌ముద్ర ఖ‌ని దుమ్ము లేపాశాడు. నెగిటివ్ షేడ్స్ పండించడంలో స‌ముద్ర‌ఖ‌ని సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు. ఉప‌యోగించుకోవాల‌ని సౌత్ లో ఒక ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ గా స‌త్తా చాట‌గ‌ల టాలెండ్ ఉంద‌నిపిస్తుంది. విశాల్ కు అసిస్టెంట్ గా చేసిన కామెడి ఆర్టిస్ట్ సూర్య అక్క‌డ‌క్క‌డ న‌వ్వించాడు.

ఈ సినిమాకి డైరెక్టర్ సుశీంద్రన్.. ఇతని స్పెషాలిటీ ఏమిటి అంటే ప్రతి సినిమాలోనూ ఒక చిన్న పాయింట్ ని స్టొరీగా అనుకొని దాని చుట్టూ చాలా గ్రిప్పింగ్ కథనం రాసుకొని సినిమా ఆధ్యంతం ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తీస్తాడు. ఈ సినిమా విషయంలో కూడా ఆటను తీసుకున్న స్టొరీ లైన్ బాగుంది, కానీ తను రాసుకున్న కథనం త‌న గ‌త చిత్రాల అంత గ్రిప్పింగ్ గా లేదు. తేలిగ్గా ప్రిడిక్ట్ చేయ‌గ‌ల స్క్రీన్ ప్లే చేసి కొంత వ‌ర‌కు ఫెయిల్ అయ్యాడనిపిస్తుంది.

ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కామెడీ వర్క్ అవుట్ అవ్వలేదు, రొమాంటిక్ ట్రాక్ లో కూడా ఒకటి రెండు సీన్స్ మాత్రమే బాగున్నాయి, మిగతా అన్నీ బోరింగ్. అలాగే కథ మొత్తం సెకండాఫ్ లో రన్ చేయడం వలన ఫస్ట్ పార్ట్ ఒకలా, సెకండ్ పార్ట్ వేరొకలా అనిపిస్తుంది. వీటన్నిటికీ మించి సినిమాలో పాటలు సినిమా మూడ్ ని ఇంకా చెడగొడతాయి. నిఖిత చేత చేయించిన స్పెషల్ సాంగ్ కూడా సినిమాకి హెల్ప్ అవ్వలేదు. మిగతా అన్నీ సినిమాకి పెద్ద మైనస్‌. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ అన్న‌ప్పుడు.. ఆడియ‌న్స్ ను థ్రిల్ల్ చేసే అంశాలు కొన్నైనా ఉండాలి. కానీ సుసీంద్ర‌న్ ఎక్క‌డ థ్రిల్ల్ చేయ‌లేక పోయాడు. కాజ‌ల్ లాంటి హీరోయిన్ ను పెట్టుకుని రొమాంటిక్ ట్రాక్ ను బ‌లంగా న‌డ‌ప‌లేక పోయాడు. రెంటికి చెడ్డ రేవ‌డి బాప‌తుగా ముగించాడు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చింది మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ డి.ఇమాన్. తమిళ పాటలని డబ్ చేసారు కావున అవి ఏవీ క్యాచీగా లేవు. కానీ ఇమాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్బ్. ఇమాన్ సంగీతమే సినిమాని చాలా చోట్ల హై రేంజ్ కి తీసుకెళ్తుంది. వేల్రాజ్ సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. నైట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే షాట్స్ ని బాగా చూపించాడు. ఆంథోనీ ఎడిటింగ్ అంతంత మాత్రంగానే ఉంది. చాలా సినిమాని సరిగా ఎడిట్ చేయకుండా వదిలేసారనిపిస్తుంది. శాశాంక్ వెన్నెలకంటి డైలాగ్స్ ఓకే.

డైరెక్ట‌ర్ ప‌నిత‌నం గురించి..

ఇక కథ – కథనం – దర్శకత్వం అనే మేజర్ డిపార్ట్ మెంట్స్ ని డీల్ చేసిన సుశీంద్రన్ విషయానికి వస్తే ఎప్పటిలానే స్టొరీ లైన్ సూపర్బ్ గా సెలక్ట్ చేసుకున్నాడు, కానీ స్టొరీ డెవలప్ మెంట్ లో మాత్రం తప్పు చేసాడు. ఆ తర్వాత కథనం విషయంలో చాలా పూర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. డైరెక్టర్ గా మాత్రం పరవాలేదనిపించుకున్నాడు. ఈ సినిమా ఫెయిల్యూర్ కి ప్రధాన కారణం సుశీంద్రన్ కథనం బాగా దెబ్బ కొట్టడమే. ఇకపోతే జి. నాగేశ్వర్ రెడ్డి – ఎస్. నరసింహ ప్రసాద్ ల డబ్బింగ్ విలువలు జస్ట్ ఓకే.

విశ్లేష‌ణ‌
ఒకే త‌ర‌హా చిత్రాలు చేస్తున్న హీరోకు క‌థ రాసుకున్నేట‌ప్పుడే క‌చ్చితంగా కొ్ంత వైవిధ్యం కోసం ప్ర‌య‌త్నించాలి. క‌నీసం క‌థ‌నంలో అయిన కొంత స‌త్తాను చాట గ‌ల‌గాలి. నా పేరు శివ వంటి సినిమాను చేసిన సుసీంద్ర‌న్ .. జ‌య‌సూర్య ను క‌నీసం ఆ రేంజ్ లో చేయ‌లేక పోయాడు. క‌థ‌నంలో ఎమోష‌న‌ల్ టించింగ్ సీన్స్ లేక పోవ‌డం కూడా సినిమాకు మైన‌స్ అనిపిస్తుంటుంది. హీరో రౌడి గ్యాంగ్ ను చంపుకుంటు వెళ్ల‌డ‌మే త‌ప్ప‌… ఎక్క‌డ ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటి లేదు. డైరెక్ట‌ర్ సుసీంద్ర‌న్ ఈ విష‌యం పై మ‌రింత శ్ర‌ద్ద పెట్టి ఉండాల్సిందే. ఎనీ వే యాక్ష‌న్ చిత్రాల్ని ఇష్ట‌ప‌డే అభిమానులు ఒక సారి చూడొచ్చు లెండి.

Click to Read డైనమైట్ మూవీ రివ్యూ

భలే భలే మగాడివోయ్ మూవీ రివ్యూ

First Published:  4 Sept 2015 8:39 AM IST
Next Story