పట్టిసీమకు మేం వ్యతిరేకం: జగన్
పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై తమ వైఖరి మారలేదని, ఇప్పటికీ తాము ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాము గత అసెంబ్లీ సమావేశాల్లో రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చలో స్పష్టం చేశామని ఆయన గుర్తు చేశారు. స్టోరేజీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కోసం రూ.1100 కోట్లకు టెండర్లు పిలిచారని, దీనివల్ల ఎవరికి ఉపయోగమని ఆయన పేర్కొన్నారు. ఈ టెండర్లను 21.9 శాతం అధిక మొత్తానికి […]
BY sarvi4 Sept 2015 5:24 AM IST
X
sarvi Updated On: 4 Sept 2015 5:24 AM IST
పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై తమ వైఖరి మారలేదని, ఇప్పటికీ తాము ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాము గత అసెంబ్లీ సమావేశాల్లో రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చలో స్పష్టం చేశామని ఆయన గుర్తు చేశారు. స్టోరేజీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కోసం రూ.1100 కోట్లకు టెండర్లు పిలిచారని, దీనివల్ల ఎవరికి ఉపయోగమని ఆయన పేర్కొన్నారు. ఈ టెండర్లను 21.9 శాతం అధిక మొత్తానికి వేసినా ఖరారు చేశారని, ముందుగా ఎంపిక చేసిన వారికే ఇచ్చేలా టెండర్ల సెలక్టివ్ టెండరింగ్ ప్రాసెస్ జరిగిందని, రూ.350 కోట్లు ఎక్కువకు కోట్ చేశారని ఆరోపించారు. ఇందులో ప్రభుత్వానికి ముడుపులు లభించాయని ఆయన ఆరోపించారు. పైపులు, పంప్‌లు తగ్గినపుడు ధర ఎందుకు తగ్గలేదని జగన్ ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజక్టు గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ పరిధిలోకి వెళుతుందన్నారు. ఈ ప్రాజెక్టు నేపథ్యంలో తమకు 45 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని తెలంగాణ కోరుతుందని అన్నారు.
Next Story