రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన దొంగ చంద్రబాబు: జగన్
ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా చంద్రబాబు పట్టుబడ్డారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై. జగన్మోహనరెడ్డి విమర్శించారు. దేశచరిత్రలో ఓ ముఖ్యమంత్రి డబ్బు ఇస్తూ దొరికిపోవడం ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు. ఈ కేసులో అన్ని ఆధారాలున్నాయనీ, దీనిపై అసెంబ్లీలో చర్చించక పోవడం దారుణమని జగన్ అన్నారు. బ్లాక్ మనీని ఓట్లు కొనేందుకు ఉపయోగించారని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. అసెంబ్లీ ఐదు రోజులే నిర్వహించడం దారుణం అని కూడా జగన్ అన్నారు. ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, కనీసం […]
BY sarvi4 Sept 2015 11:37 AM IST
X
sarvi Updated On: 4 Sept 2015 11:37 AM IST
ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా చంద్రబాబు పట్టుబడ్డారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై. జగన్మోహనరెడ్డి విమర్శించారు. దేశచరిత్రలో ఓ ముఖ్యమంత్రి డబ్బు ఇస్తూ దొరికిపోవడం ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు. ఈ కేసులో అన్ని ఆధారాలున్నాయనీ, దీనిపై అసెంబ్లీలో చర్చించక పోవడం దారుణమని జగన్ అన్నారు. బ్లాక్ మనీని ఓట్లు కొనేందుకు ఉపయోగించారని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. అసెంబ్లీ ఐదు రోజులే నిర్వహించడం దారుణం అని కూడా జగన్ అన్నారు. ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, కనీసం 15 రోజులైనా సమావేశాలు నిర్వహించాలని కోరామని అయినా తమ ప్రతిపాదన ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ప్రభుత్వం కావాలనే ఆ ప్రతిపాదనను తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. ఎక్కువసేపు చర్చ జరగకూడదన్నదే ప్రభుత్వ దుర్బుద్ధి అని విమర్శించారు.
Next Story