నవాజ్ షరీఫ్‌కు హురియత్ నేత గిలానీ లేఖ
‘పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడినైన సయ్యద్ గిలానీ వ్రాయునది ఏమనగా.. భారత్-పాకిస్తాన్ దేశాల మద్య జాతీయ భద్రతాసలహాదారుల స్థాయి సమావేశానికి మీరు కాశ్మీర్ సమస్యను అజెండా తీసుకుంటామని ప్రకటించడం మమ్మల్ని ఆనందింప జేసింది. కాశ్మీర్ భారత్-పాక్ మధ్య నలుగుతున్నది ఓ ప్రాంతీయ సమస్య కాదు. ఎన్నో యేళ్ళుగా అన్యాయానికి గురవుతున్న లక్షల మంది కాశ్మీరీల సమస్య..భారత్‌తో చర్చలకు సందర్భంగా మీరు కాశ్మీర్ సమస్యను లేవనెత్తితే ..కాశ్మీరీల సమస్య ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యేందుకు మీ ప్రతిపాదన […]
BY sarvi4 Sept 2015 8:06 AM IST
X
sarvi Updated On: 4 Sept 2015 9:21 AM IST
‘పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడినైన సయ్యద్ గిలానీ వ్రాయునది ఏమనగా.. భారత్-పాకిస్తాన్ దేశాల మద్య జాతీయ భద్రతాసలహాదారుల స్థాయి సమావేశానికి మీరు కాశ్మీర్ సమస్యను అజెండా తీసుకుంటామని ప్రకటించడం మమ్మల్ని ఆనందింప జేసింది. కాశ్మీర్ భారత్-పాక్ మధ్య నలుగుతున్నది ఓ ప్రాంతీయ సమస్య కాదు. ఎన్నో యేళ్ళుగా అన్యాయానికి గురవుతున్న లక్షల మంది కాశ్మీరీల సమస్య..భారత్‌తో చర్చలకు సందర్భంగా మీరు కాశ్మీర్ సమస్యను లేవనెత్తితే ..కాశ్మీరీల సమస్య ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యేందుకు మీ ప్రతిపాదన దోహదపడేది. పాకిస్తాన్ ఆర్మీ, మీరు కాశ్మీర్ సమస్యపై పోరాడుతున్నందుకు ధన్యవాదాలు’ అని ఉర్దూలో గిలానీ రాసిన లేఖను సయ్యద్ గిలానీ వర్గానికి చెందిన హురియత్ కాన్ఫరెన్స్‌కు చెందిన ముగ్గురు ప్రతినిథుల బృందం ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌కు అందజేశారు. పాక్ హైకమిషన్ అధికారులు ఆ లేఖను పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పంపిస్తామని హామీ ఇచ్చారని హురియత్ నేతలు తెలిపారు.
Next Story