గృహ నిర్మాణానికి తెలంగాణ తొలి అడుగు
మార్చినాటికి 60 వేల గృహాల నిర్మాణానికి నిర్ణయం పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. పేదవర్గాలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వచ్చే మార్చినాటికి 60 వేల ఇళ్ళు నిర్మించాలని నిర్ణయించింది. 3.900 కోట్ల రూపాయలతో చేపట్టే ఇళ్ళ నిర్మాణాలకు త్వరలోనే టెండర్లు పిలువనున్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల్లో గృహాల నిర్మాణం కోసం అధికారుల జరిపిన కసరత్తు పూర్తయింది. […]
BY sarvi4 Sept 2015 11:27 AM IST
X
sarvi Updated On: 4 Sept 2015 11:27 AM IST
మార్చినాటికి 60 వేల గృహాల నిర్మాణానికి నిర్ణయం
పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. పేదవర్గాలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వచ్చే మార్చినాటికి 60 వేల ఇళ్ళు నిర్మించాలని నిర్ణయించింది. 3.900 కోట్ల రూపాయలతో చేపట్టే ఇళ్ళ నిర్మాణాలకు త్వరలోనే టెండర్లు పిలువనున్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల్లో గృహాల నిర్మాణం కోసం అధికారుల జరిపిన కసరత్తు పూర్తయింది. పట్టణాలలో అపార్ట్‌మెంట్లు, పల్లెల్లో ఇండ్లను నిర్మించాలని నిర్ణయించారు. పట్టణాలలో స్థలాభావం కారణంగా ఫ్లాట్లను 560 చదరపు అడుగుల్లో ఒక్కొక్కటి చొప్పున నిర్మిస్తారు. జీ ప్లస్ 1,2,3,4.. ఇలా వీలును బట్టి అంతస్తుల నిర్మాణాలు చేపడతారు. ముందుగా ప్రభుత్వ స్థలాల్లో ప్రారంభించే గృహ నిర్మాణాల కోసం త్వరలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో టెండర్ ప్రక్రియ చేపట్టనున్నారు. వచ్చే మార్చి నాటికి లబ్ధిదారులకు రూపాయి ఖర్చు లేకుండా 3,900 కోట్ల రూపాయల ఖర్చుతో 60 వేల గృహాలను నిర్మించి అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఒక్కో నియోజకవర్గంలో 400 ఇండ్లు
రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గంలో 400 ఇళ్ళను నిర్మిస్తారు. పట్టణాలలో ఒక్కో ఫ్లాట్‌ను 560 చదరపు అడుగుల్లో రూ.5.30 లక్షల ఖర్చుతో నిర్మిస్తారు. గ్రామాలలో ఒక్కో ఇంటిని 530 చదరపు అడుగుల్లో రూ.5.04 లక్షలు వెచ్చించి పూర్తి చేస్తారు. మౌలిక సదుపాయాలైన రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు తదితరాల కోసం అదనంగా నిధులు కేటాయించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ‘హౌసింగ్ ఫర్ ఆల్’ పథకం కింద రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాలలో నిర్మించే ఇళ్ళ కోసం రూ.305 కోట్లను కేటాయించింది. పట్టణాలలో ఒక్కో గృహానికి రూ.లక్ష, గ్రామాలలో ఒక్కో గృహానికి రూ.35 వేలు గ్రాంట్‌గా అందిస్తుంది. మిగతా పూర్తి ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. 119 నియోజకవర్గాలతోపాటు నామినేటెడ్ ఎమ్మెల్యే కోటా కలుపుకుని మొత్తంగా 48 వేల గృహాలు కేటాయిస్తారు. సీఎం కోటాలో 12 వేల గృహాలు ఉంటాయి. ప్రజలకు సీఎం ఇచ్చిన హామీ మేరకు వివిధ ప్రాంతాలలో ఈ పక్కా గృహాల కేటాయింపులు జరుగుతాయి.
Next Story