పూరి పై దాసరి ఫైర్...
దర్శకరత్న దాసరి నారాయణరావుకు ఫంక్షన్లలో హీరోలపై సెటైర్లు వేయడం మనేది ఒక అలవాటు. ఇక ఈ విషయంలో దాసరికి మెగా ఫ్యామిలిపై కొద్దిగ మక్కువ ఎక్కువనే చెప్పాలి. అయితే ఈ సారి దర్శకరత్న.. దర్శకుడు పూరి జగన్నాద్ పై మండిపడ్డారు. తెలుగు సినిమా గతి తప్పడానికి పూరి జగన్నాద్ కారణమంటూ దాసరి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఒకప్పుడు తెలుగు సినిమా హీరో అంటే ఊరి కోసం ,జనం కోసం ఆదర్శంగా ఉండేవాళ్ళు. తల్లిదండ్రులను గౌరవించేవాడుగా చూపించేవారు. […]
BY admin4 Sept 2015 12:32 AM IST

X
admin Updated On: 4 Sept 2015 7:42 AM IST
దర్శకరత్న దాసరి నారాయణరావుకు ఫంక్షన్లలో హీరోలపై సెటైర్లు వేయడం మనేది ఒక అలవాటు. ఇక ఈ విషయంలో దాసరికి మెగా ఫ్యామిలిపై కొద్దిగ మక్కువ ఎక్కువనే చెప్పాలి. అయితే ఈ సారి దర్శకరత్న.. దర్శకుడు పూరి జగన్నాద్ పై మండిపడ్డారు. తెలుగు సినిమా గతి తప్పడానికి పూరి జగన్నాద్ కారణమంటూ దాసరి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఒకప్పుడు తెలుగు సినిమా హీరో అంటే ఊరి కోసం ,జనం కోసం ఆదర్శంగా ఉండేవాళ్ళు. తల్లిదండ్రులను గౌరవించేవాడుగా చూపించేవారు. అయితే పూరి సినిమాల వలన ఇప్పుడు ఆ హీరో జీరోగా మారిపోయాడని, ”ఇడియట్ ” సినిమా వచ్చిన తర్వాతే హీరోల బాడీ లాంగ్వేజ్ మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల గురించి వెటకారంగా మాట్లాడేవాదు, అమ్మాయిలను రోడ్ పై ఏడ్పించేవాడు హీరో అయిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇదే దాసరి కొంతకాలం క్రితం టెంపర్ సినిమా చూసిన తరువాత.. పూరి జగన్నాద్ నా వారసుడు అని చెప్పడం కోసమెరుపు. అప్పుడు పోగడ్త్లలతో ముంచెత్తిన దాసరి మరి ఇప్పుడు విమర్శలు చేయడం వెనుక అంతర్యం ఏమిటో అని అర్ధం కాక సినిపరిశ్రమ దిగ్గజాలు ఆలోచనలో పడ్డారు
Next Story