Telugu Global
NEWS

'కంతనపల్లి' కోసం కిషన్‌రెడ్డి పాదయాత్ర, 

అర్ధాంతరంగా నిలిపేసిన కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కోరుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో కంతనపల్లి నుండి దేవాదుల వరకు పాదయాత్ర ప్రారంభించారు.  ఈ యాత్ర ఐదు కిలోమీటర్లు సాగగానే ములుగు డిఎస్పీ రాజమహేంద్రనాయక్‌ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర పొడవునా అన్ని ఆదివాసీ గ్రామాలే ఉన్నాయని, ఆదివాసీలందరూ ఆందోళనకు దిగే అవకాశాలున్నాయని, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైనందున భద్రతా చర్యల్లో భాగంగా పాదయాత్ర విరమించుకోవాలని డిఎస్పీ కోరారు. అందుకు కిషన్‌రెడ్డి ఒప్పుకోకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల […]

Kishan reddy padayatraఅర్ధాంతరంగా నిలిపేసిన కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కోరుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో కంతనపల్లి నుండి దేవాదుల వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర ఐదు కిలోమీటర్లు సాగగానే ములుగు డిఎస్పీ రాజమహేంద్రనాయక్‌ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర పొడవునా అన్ని ఆదివాసీ గ్రామాలే ఉన్నాయని, ఆదివాసీలందరూ ఆందోళనకు దిగే అవకాశాలున్నాయని, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైనందున భద్రతా చర్యల్లో భాగంగా పాదయాత్ర విరమించుకోవాలని డిఎస్పీ కోరారు. అందుకు కిషన్‌రెడ్డి ఒప్పుకోకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యను బిజెపి కార్యకర్తలు ఖండించారు. దీంతో కార్యకర్తలకు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. పాదయాత్రను ముందుకు వెళ్లనిచ్చేది లేదని పోలీసులు చెప్పడంతో తోపులాట చోటుచేసుకుంది. బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డిని ఈడ్చుకెళ్లారు. పోలీసుల తీరును నిరసిస్తూ కార్యకర్తలు పోలీసువాహనాలకు అడ్డంగా పడుకుని నినాదాలు చేశారు. కిషన్‌రెడ్డితో పాటు బిజెపి ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసేవరకూ పోరాడతామని హెచ్చరించారు.
First Published:  4 Sept 2015 12:54 AM IST
Next Story