Telugu Global
Others

Wonder World 15

స్టార్‌ హోటళ్లలో బాత్‌టబ్‌లు గాయబ్‌ పేరుపొందిన స్టార్‌ హోటళ్లకు నీళ్ల బెంగ పట్టుకుంది. నీళ్ల కొరతను దృష్టిలో ఉంచుకుని చాలా హోటళ్లు బాత్‌ టబ్‌లను కట్టించడం లేదట. కొన్ని హోటళ్లు ఉన్నవి తీసేస్తున్నాయట. హాలిడే ఇన్‌, మారియట్‌, లెమన్‌ ట్రీ, ది ఫెర్న్‌, పార్క్‌ ఇన్‌ వంటి స్టార్‌ హోటళ్లు కొత్తగా కట్టించే చోట బాత్‌ టబ్‌లు లేకుండా జాగ్రత్త పడుతున్నాయి. నీటి కొరతను దృష్టిలో ఉంచుకునే ఈ హోటళ్లు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాయని అంటున్నారు. కానీ […]

Wonder World 15
X

స్టార్‌ హోటళ్లలో బాత్‌టబ్‌లు గాయబ్‌

పేరుపొందిన స్టార్‌ హోటళ్లకు నీళ్ల బెంగ పట్టుకుంది. నీళ్ల కొరతను దృష్టిలో ఉంచుకుని చాలా హోటళ్లు బాత్‌ టబ్‌లను కట్టించడం లేదట. కొన్ని హోటళ్లు ఉన్నవి తీసేస్తున్నాయట. హాలిడే ఇన్‌, మారియట్‌, లెమన్‌ ట్రీ, ది ఫెర్న్‌, పార్క్‌ ఇన్‌ వంటి స్టార్‌ హోటళ్లు కొత్తగా కట్టించే చోట బాత్‌ టబ్‌లు లేకుండా జాగ్రత్త పడుతున్నాయి. నీటి కొరతను దృష్టిలో ఉంచుకునే ఈ హోటళ్లు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాయని అంటున్నారు. కానీ మారియట్‌ హోటల్‌ చెయిన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ మీనన్‌ మాట్లాడుతూ తమ హోటళ్లకు వచ్చే అతిథులు బాత్‌ టబ్‌ స్నానం కన్నా షవర్‌ స్నానాన్నే ఇష్టపడుతున్నారని అందువల్లే బాత్‌ టబ్‌లను తీసేస్తున్నామని చెప్పారు. 85శాతం మంది అతిధులు బాత్‌టబ్‌ స్నానం కన్నా వేగంగా పూర్తయిపోయే షవర్‌ స్నానాన్నే ఇష్టపడుతున్నారని హాలిడే ఇన్‌, హాలిడే ఇన్‌ ఎక్స్‌ప్రెస్‌ హోటళ్లను నడిపే ఇంటర్‌ కాంటినెంటల్‌ హోటల్స్‌ గ్రూప్‌ నిర్వహించిన సర్వేలో తేలిందట. బాత్‌ టబ్‌లను తీసేస్తే నీటి వినియోగం 11శాతం తగ్గిపోతుందని, భవన నిర్మాణ వ్యయంలోనూ 5శాతం కలసి వస్తుందని ఇంటర్‌ కాంటినెంటల్‌ హోటల్స్‌ గ్రూప్‌ ఆగ్నేయాసియా వైస్‌ ప్రెసిడెంట్‌ డగ్లస్‌ మార్టెల్‌ తెలిపారు. షవర్‌ స్నానానికి 100 లీటర్ల నీరు సరిపోతే బాత్‌ టబ్‌ స్నానానికి 250 లీటర్ల నీరు కావాల్సి ఉంటుందట. 400 కోట్ల రూపాయల వ్యయంతో ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మిస్తే అందులో బాత్‌ టబ్‌ల వ్యయమే 20 కోట్లు ఉంటుందట. అవి లేకపోతే 5శాతం ఖర్చు తగ్గినట్లే మరి. నీటి ఆదాతో పాటు నిర్మాణ వ్యయం కూడా కలసివస్తున్నందున స్టార్‌ హోటళ్లు ఇపుడు బాత్‌టబ్‌ల ఊసెత్తడం లేదు.

First Published:  2 Sep 2015 1:04 PM GMT
Next Story