రామాయణం, మహా భారతాలపై స్టాంపులు!
హిందూ ఆధ్యాత్మికులకు మోదీ ప్రభుత్వం మరో తీపి వార్త తీసుకువచ్చింది. సోమవారం రామచరిత మానస్ డిజిటల్ సీడీలను అందుబాటులోకి తీసుకువచ్చిన రెండురోజులకే మరో కబురు మోసుకొచ్చింది. రామాయణ, మహాభారతాలపై త్వరలోనే పోస్టల్ స్టాంపులు విడుదల చేయనున్నట్లు బుధవారం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. దీంతోపాటు స్వాతంత్ర్య సమయయోధులు భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బటుకేశ్వర్ దత్, సుఖ్‌దేవ్, అష్పాకుల్లాహ్ ఖాన్, గాయకులు మహమ్మద్ రఫీ, కిశోర్ కుమార్‌ల స్టాంపులు కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంపై పలు […]
BY sarvi3 Sept 2015 6:05 AM IST
X
sarvi Updated On: 3 Sept 2015 6:05 AM IST
హిందూ ఆధ్యాత్మికులకు మోదీ ప్రభుత్వం మరో తీపి వార్త తీసుకువచ్చింది. సోమవారం రామచరిత మానస్ డిజిటల్ సీడీలను అందుబాటులోకి తీసుకువచ్చిన రెండురోజులకే మరో కబురు మోసుకొచ్చింది. రామాయణ, మహాభారతాలపై త్వరలోనే పోస్టల్ స్టాంపులు విడుదల చేయనున్నట్లు బుధవారం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. దీంతోపాటు స్వాతంత్ర్య సమయయోధులు భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బటుకేశ్వర్ దత్, సుఖ్‌దేవ్, అష్పాకుల్లాహ్ ఖాన్, గాయకులు మహమ్మద్ రఫీ, కిశోర్ కుమార్‌ల స్టాంపులు కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంపై పలు హిందూ ఆధ్యాత్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి స్వాతంత్ర్య సమరయోధులకు సరైన గౌరవం దక్కిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Next Story