ప్రాణం తీసిన సెల్పీ!
సెల్ఫీలతో ప్రాణాలు పోతున్నా.. యువతకు మాత్రం ఆ వెర్రి దిగడం లేదు. తాజాగా మరో యువకుడు సెల్పీ బారిన పడిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాలోని హోస్టన్‌కు చెందిన డెలిన్ అలెన్సో స్మిత్ (19) తుపాకీతో సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ అది పేలడంతో ప్రాణాలు కోల్పోయాడు. అలెన్సో మంగళవారం సోషల్ నెట్‌వర్క్ సైట్‌లో పోస్ట్ చేసేందుకు వెరైటీ సెల్పీ తీద్దామనుకున్నాడు. ఈ క్రమంలో తుపాకీతో సెల్ఫీ తీస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. ఐడియా వచ్చిందే […]
BY Pragnadhar Reddy2 Sept 2015 10:29 PM IST
X
Pragnadhar Reddy Updated On: 3 Sept 2015 1:33 AM IST
సెల్ఫీలతో ప్రాణాలు పోతున్నా.. యువతకు మాత్రం ఆ వెర్రి దిగడం లేదు. తాజాగా మరో యువకుడు సెల్పీ బారిన పడిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాలోని హోస్టన్‌కు చెందిన డెలిన్ అలెన్సో స్మిత్ (19) తుపాకీతో సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ అది పేలడంతో ప్రాణాలు కోల్పోయాడు. అలెన్సో మంగళవారం సోషల్ నెట్‌వర్క్ సైట్‌లో పోస్ట్ చేసేందుకు వెరైటీ సెల్పీ తీద్దామనుకున్నాడు. ఈ క్రమంలో తుపాకీతో సెల్ఫీ తీస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. ఐడియా వచ్చిందే తడవుగా.. లోడ్ చేసిన తుపాకీని చేతిలోకి తీసుకున్నాడు. సెల్‌ఫోన్ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి.. కెమెరా బటన్‌కు బదులుగా తుపాకీ ట్రిగ్గర్ నొక్కాడు. తుపాకీ లాక్ ఓపెన్‌గా ఉండటంతో అది పేలింది. ఇంకేముంది? అలెన్సో మృతిచెందాడు.
Next Story