Telugu Global
Others

ఖరీఫ్‌ సాగుపై వర్షాభావం దెబ్బ

కరువు మండలాల విషయంలో ఇప్పటికే నివేదికలు పంపామని, రెవెన్యూశాఖ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి  వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వర్షాభావం వల్ల ఖరీఫ్‌ సాగుపై ప్రభావం పడిందని, ఈ ఖరీఫ్‌లో 41.43 లక్షల హెక్టార్లు సాగు కావాల్సి ఉండగా, 34.80 లక్షల ఎకరాలు(82శాతం)సాగు చేశారని తెలిపారు. సకాలంలో రుణాలు చెల్లించి రెన్యువల్ చేసుకున్న రైతులకు వడ్డీ చెల్లించడానికి ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసిందన్నారు. సకాలంలో రుణాలు చెల్లించి, రెన్యువల్ చేసుకున్న […]

ఖరీఫ్‌ సాగుపై వర్షాభావం దెబ్బ
X
కరువు మండలాల విషయంలో ఇప్పటికే నివేదికలు పంపామని, రెవెన్యూశాఖ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వర్షాభావం వల్ల ఖరీఫ్‌ సాగుపై ప్రభావం పడిందని, ఈ ఖరీఫ్‌లో 41.43 లక్షల హెక్టార్లు సాగు కావాల్సి ఉండగా, 34.80 లక్షల ఎకరాలు(82శాతం)సాగు చేశారని తెలిపారు. సకాలంలో రుణాలు చెల్లించి రెన్యువల్ చేసుకున్న రైతులకు వడ్డీ చెల్లించడానికి ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసిందన్నారు. సకాలంలో రుణాలు చెల్లించి, రెన్యువల్ చేసుకున్న రైతులు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే చెల్లిస్తుందని పోచారం తెలిపారు. ప్రభుత్వ ఉత్వర్వులకు విరుద్ధంగా ఎవరైనా బ్యాంకర్లు రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తే తిరిగి చెల్లిస్తామని మంత్రి స్పష్టం చేశారు. లక్షలోపు రుణాలకు వడ్డీలేదని, మూడు లక్షలలోపు రుణాలకు పావలా వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు.
First Published:  2 Sept 2015 6:38 PM IST
Next Story