గోవధపై నిషేధం విధించండి: ఎంపీ సలీం
గోవధపై జాతీయస్థాయిలో నిషేధం విధించాలని ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) రాజ్యసభ సభ్యుడు మునావర్ సలీం డిమాండ్ చేశారు. ‘గోవు మనకు తల్లిలాంటింది. గోవధపై ప్రభుత్వం వెంటనే నిషేధం విధించాలి’ అని అన్నారు. జాతీయ స్థాయిలో గోవధ నిషేధంపై సాధ్యమైన మేరకు తమ వంతు ప్రయత్నం చేస్తామని గతంలో ఎన్డీఏ సర్కారు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. నాసిక్ కుంభమేళాలో ఆయన పాల్గొని విలేకరులతో మాట్లాడారు. గతంలో మొఘల్ చివరి చక్రవర్తి బహదుర్ జఫర్ గోవధపై నిషేధం […]
BY admin2 Sept 2015 6:49 PM IST
admin Updated On: 3 Sept 2015 12:05 PM IST
గోవధపై జాతీయస్థాయిలో నిషేధం విధించాలని ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) రాజ్యసభ సభ్యుడు మునావర్ సలీం డిమాండ్ చేశారు. ‘గోవు మనకు తల్లిలాంటింది. గోవధపై ప్రభుత్వం వెంటనే నిషేధం విధించాలి’ అని అన్నారు. జాతీయ స్థాయిలో గోవధ నిషేధంపై సాధ్యమైన మేరకు తమ వంతు ప్రయత్నం చేస్తామని గతంలో ఎన్డీఏ సర్కారు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. నాసిక్ కుంభమేళాలో ఆయన పాల్గొని విలేకరులతో మాట్లాడారు. గతంలో మొఘల్ చివరి చక్రవర్తి బహదుర్ జఫర్ గోవధపై నిషేధం విధించిన విషయాన్ని గుర్తు చేశారు. గోవధకు పాల్పడ్డవారికి మరణ దండన విధించేవారని తెలిపారు.
Next Story