Telugu Global
Others

ఆ వీడియో హ‌ర్దిక్ ప‌టేల్‌దేనా?

ప‌టేళ్ల‌ను ఓబీసీలో చేర్చాల‌ని గుజ‌రాత్‌లో ఉద్య‌మానికి తెర‌లేపిన‌ యువ‌ నాయ‌కుడు హ‌ర్దిక్ ప‌టేల్ పేరుతో విడుద‌లైన ఓ వీడియో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఓ అమ్మాయి, స్నేహితుల‌తో క‌లిసి హోట‌ల్ గ‌దిలో స‌ర‌సాలు ఆడుతున్న వీడియో ఒక‌టి  నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అయితే, ఆ వీడియోలో ఉన్న‌ది హ‌ర్దిక్ ప‌టేలేనా?  కాదా? అన్న‌ది ఇంకా తేల‌లేదు. అత‌నిది చెందిన‌ట్లుగానే  భావిస్తున్న ఈ వీడియో 1.10 నిమిషాల నిడివి క‌లిగి ఉంది. బ్యాంకాక్‌లో హ‌ర్దిక్ రాస‌లీలలు అన్న పేరిట విడుద‌లైన […]

ఆ వీడియో హ‌ర్దిక్ ప‌టేల్‌దేనా?
X
ప‌టేళ్ల‌ను ఓబీసీలో చేర్చాల‌ని గుజ‌రాత్‌లో ఉద్య‌మానికి తెర‌లేపిన‌ యువ‌ నాయ‌కుడు హ‌ర్దిక్ ప‌టేల్ పేరుతో విడుద‌లైన ఓ వీడియో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఓ అమ్మాయి, స్నేహితుల‌తో క‌లిసి హోట‌ల్ గ‌దిలో స‌ర‌సాలు ఆడుతున్న వీడియో ఒక‌టి నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అయితే, ఆ వీడియోలో ఉన్న‌ది హ‌ర్దిక్ ప‌టేలేనా? కాదా? అన్న‌ది ఇంకా తేల‌లేదు. అత‌నిది చెందిన‌ట్లుగానే భావిస్తున్న ఈ వీడియో 1.10 నిమిషాల నిడివి క‌లిగి ఉంది. బ్యాంకాక్‌లో హ‌ర్దిక్ రాస‌లీలలు అన్న పేరిట విడుద‌లైన ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతోంది. వీడియోలో ఉన్న యువకుడు హార్దిక్‌ కాదని పటేల్‌ సామాజిక వర్గానికి చెందిన వారు అంటున్నారు. తమ ఉద్యమాన్ని నీరుగార్చేందుకే ఇలా కుట్రలు పన్నారని ఆరోపిస్తున్నారు.
First Published:  2 Sept 2015 6:35 PM IST
Next Story