భీమవరంలో దొరికిన ఇంజెక్షన్ సైకో
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజలను భయపెట్టిన ఇంజక్షన్ సైకోను పోలీసులు భీమవరంలో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 18 మందిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. మొదటి మూడు రోజులపాటు దాడులకు పాల్పడింది తానేనని ఈ సైకో ఒప్పుకున్నట్లు సమాచారం. ఇంజక్షన్ సైకో ఉన్నత విద్యావంతుడని తెలిసింది. సైకోను పట్టుకున్నవారికి లక్ష రూపాయల బహుమతిని ప్రకటించారు. ముఖ్యంగా చిన్నారులను, మహిళలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఇంజెక్షన్ల వ్యవహారంపై సైకోను పట్టకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు ఒకడ్ని […]
BY sarvi3 Sept 2015 7:53 AM IST
X
sarvi Updated On: 3 Sept 2015 7:53 AM IST
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజలను భయపెట్టిన ఇంజక్షన్ సైకోను పోలీసులు భీమవరంలో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 18 మందిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. మొదటి మూడు రోజులపాటు దాడులకు పాల్పడింది తానేనని ఈ సైకో ఒప్పుకున్నట్లు సమాచారం. ఇంజక్షన్ సైకో ఉన్నత విద్యావంతుడని తెలిసింది. సైకోను పట్టుకున్నవారికి లక్ష రూపాయల బహుమతిని ప్రకటించారు. ముఖ్యంగా చిన్నారులను, మహిళలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఇంజెక్షన్ల వ్యవహారంపై సైకోను పట్టకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు ఒకడ్ని పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులకు మరో సవాలు ఎదురైంది. బుధవారం తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో జరిగిన దాడిలో ఓ మహిళ పాల్గొనడంతో సైకోలు మరింత మంది ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన ఇంజెక్షన్ దాడులకు సంబంధించి నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
Next Story