ఎన్నికల వ్యూహంతోనే చీప్ లిక్కర్‌పై యూటర్న్?
చీప్ లిక్కర్‌పై ప్రభుత్వ నిర్ణయం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. త్వరలో వరంగల్ పార్లమెంటు, నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అలాగే గ్రేటర్ హైదరాబాద్‌కూ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. చౌక మద్యం విధానం ఇప్పటికిప్పడు అమలు చేస్తే.. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలకు ఇది చక్కటి అస్ర్తంగా మారుతుంది. దీనికి ప్రజా వ్యతిరేకత తోడైతే.. నష్టపోతామని పసిగట్టిన కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని అనిపిస్తోంది. గతేడాది కేసీఆర్ రాజీనామాతో ఖాళీ అయిన మెదక్ పార్లమెంటు స్థానంకు హోరాహోరీ […]
BY sarvi3 Sept 2015 5:52 AM IST
X
sarvi Updated On: 3 Sept 2015 5:52 AM IST
చీప్ లిక్కర్‌పై ప్రభుత్వ నిర్ణయం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. త్వరలో వరంగల్ పార్లమెంటు, నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అలాగే గ్రేటర్ హైదరాబాద్‌కూ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. చౌక మద్యం విధానం ఇప్పటికిప్పడు అమలు చేస్తే.. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలకు ఇది చక్కటి అస్ర్తంగా మారుతుంది. దీనికి ప్రజా వ్యతిరేకత తోడైతే.. నష్టపోతామని పసిగట్టిన కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని అనిపిస్తోంది. గతేడాది కేసీఆర్ రాజీనామాతో ఖాళీ అయిన మెదక్ పార్లమెంటు స్థానంకు హోరాహోరీ ప్రచారం జరిగినా… ఓట్ల సాధనలో కాంగ్రెస్, బీజేపీలు సమీప దూరంలో కూడా నిలవలేకపోయాయి. ఇదే ఉత్సాహంతో ఉప ఎన్నికల స్థానాల్ని కైవసం చేసుకోవాలని, కడియం శ్రీహరి సాధించిన మెజారిటీ కన్నా ఎక్కువ సాధించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే చీప్ లిక్కర్‌పై వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. వరంగల్ టీఆర్‌ఎస్ స్థానమే అయినప్పటికీ, నారాయణ్‌ఖేడ్ కాంగ్రెస్ గెలిచిన స్థానం. ఈ రెండు దక్కించుకుంటే ప్రభుత్వ ప్రతిష్ట మరింత పెరుగుతుందని టీఆర్‌ఎస్ నాయకత్వం భావిస్తోంది. అందుకే చీప్ లిక్కర్‌ను ఇప్పటికిప్పుడు ప్రవేశపెట్టి ప్రతిపక్షాల చేతిలో ఓ అస్త్రం పెట్టడం ఇష్టంలేకే యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
చీప్ లిక్కర్‌ను కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు వ్యతిరేకించినా ముందుకెళదామనే ప్రభుత్వం నిర్ణయించుకుంది. కానీ, ప్రజాసంఘాలు, మేథావులు కూడా ఈ నిర్ణయంపై బహిరంగంగానే విమర్శలు గుప్పించడంతో సర్కారు పునరాలోచనలో పడింది. దీంతో కేబినెట్ భేటీ తర్వాత చౌక మద్యం ప్రతిపాదనను ఉపసహించుకుంటున్నామని ప్రకటించారు. అదే సమయంలో గుడంబా, నాటుసారాల తయారీపై ఉక్కు పాదం మోపుతామని వెల్లడించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి మద్యాన్ని తయారు చేసే వారిపై పీడీ యాక్ట్‌లు నమోదు చేస్తామని స్పష్టం చేయడం ద్వారా ప్రభుత్వ విధానాన్ని ప్రకటించారు.
Next Story