ఆశావర్కర్ల నిరవధిక దీక్షలు
సమస్యలు పరిష్కరించాలని, రెండో ఏఎన్‌ఎంలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ వాలంటరీ హెల్త్ కమ్యూనిటీ హెల్త్‌వర్కర్స్ యూనియన్(సిఐటియు) ఆధ్వర్యంలో ఆశావర్కర్లు నిరవధిక దీక్షలు చేపట్టారు. వీటిని సిఐటియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి.రాజారావు ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ… ఆశావర్కర్లు కనీస వేతనాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొం టున్నారన్నారు. చాలీచాలని పారితోషికాలతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశాలతో అన్ని రకాల పనులు చేయించుకుని కనీస వేతనం ఇవ్వకపోవడం దారుణమన్నారు. పెండింగ్‌లో ఉన్న పారితోషికాలు, యూనిఫాం […]
BY admin2 Sept 2015 6:50 PM IST
admin Updated On: 3 Sept 2015 12:07 PM IST
సమస్యలు పరిష్కరించాలని, రెండో ఏఎన్‌ఎంలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ వాలంటరీ హెల్త్ కమ్యూనిటీ హెల్త్‌వర్కర్స్ యూనియన్(సిఐటియు) ఆధ్వర్యంలో ఆశావర్కర్లు నిరవధిక దీక్షలు చేపట్టారు. వీటిని సిఐటియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి.రాజారావు ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ… ఆశావర్కర్లు కనీస వేతనాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొం టున్నారన్నారు. చాలీచాలని పారితోషికాలతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశాలతో అన్ని రకాల పనులు చేయించుకుని కనీస వేతనం ఇవ్వకపోవడం దారుణమన్నారు. పెండింగ్‌లో ఉన్న పారితోషికాలు, యూనిఫాం అందజేయాలని, కనీస వేతనం రూ.15వేలు, అర్హులైన వారిని రెండో ఏఎన్‌ఎంగా గుర్తించాలని, ప్రసూతి సెలవులు ప్రకటించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
Next Story