Wonder World 14
పిల్లులు పెంపుడు జంతువులు కావా? మనదేశంలో పిల్లులను అశుభ సూచకంగా భావిస్తాం. కానీ చాలా దేశాలలో పిల్లులు అత్యంత ముఖ్యమైన పెంపుడు జంతువులు. అసలు విచిత్రమేమిటంటే పిల్లులు పెంపుడు జంతువులు కానేకావట. పెంపుడు జంతువులుగా మనం మచ్చిక చేసుకునే పిల్లులు ఎక్కువ విసుగ్గా ఉంటాయని అధ్యయనాలలో తేలింది. తమ యజమానులు దగ్గరకు తీసుకుంటున్న సమయంలో పిల్లులు అలసట, యూంగ్జయిటీ ఉండే సందర్బాలలో విడుదల చేసే హార్మోనులు విడుదల చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ———————————————————————————– స్టోన్‌హెంజ్ సూర్యోదయం! ఇంగ్లండ్‌లోని స్టోన్‌హెంజ్ […]
పిల్లులు పెంపుడు జంతువులు కావా?
మనదేశంలో పిల్లులను అశుభ సూచకంగా భావిస్తాం. కానీ చాలా దేశాలలో పిల్లులు అత్యంత ముఖ్యమైన పెంపుడు జంతువులు. అసలు విచిత్రమేమిటంటే పిల్లులు పెంపుడు జంతువులు కానేకావట. పెంపుడు జంతువులుగా మనం మచ్చిక చేసుకునే పిల్లులు ఎక్కువ విసుగ్గా ఉంటాయని అధ్యయనాలలో తేలింది. తమ యజమానులు దగ్గరకు తీసుకుంటున్న సమయంలో పిల్లులు అలసట, యూంగ్జయిటీ ఉండే సందర్బాలలో విడుదల చేసే హార్మోనులు విడుదల చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
———————————————————————————–
స్టోన్‌హెంజ్ సూర్యోదయం!
ఇంగ్లండ్‌లోని స్టోన్‌హెంజ్ ప్రాంతం చాలా ప్రత్యేకమైనది. ఆకారంలో అతి భారీ వైన రాళ్లను ఒక క్రమపద్ధతిలో నిలబెట్టి ఉంచినట్లు కనిపిస్తాయి. వీటిని ఇలా ఎప్పుడు ఏర్పాటు చేశారో ఎవరికీ తెలియదు. అసలు వీటిని ఎవరైనా ఏర్పాటు చేశారా లేక కాలక్రమంలో అవి అలా ఏర్పడ్డాయో కూడా తెలియదు. అయితే ప్రతిఏటా శీతాకాలంలో ఇక్కడ జరిగే సంబరాలు మాత్రం అతి పురాతనమైనవిగా గుర్తింపు పొందాయి. ఈ రాళ్ళ మధ్య నుంచి సూర్యోదయాన్ని చూడడం మంచి చేస్తుందని చాలా మంది నమ్ముతారు.
———————————————————————————–
అమెరికన్ల బరువు బాధ!
కొత్త సంవత్సరంలో చాలా మంది అదిచేద్దాం ఇది చేద్దాం అంటూ కొత్త నిర్ణయాలు తీసుకుంటుండడం కామనే. అమెరికాలో 40శాతం మంది ఇలా న్యూ ఇయర్ డెసిషన్స్ తీసుకుంటుంటారు. అయితే కేవలం 8శాతం మంది మాత్రమే వాటిని పాటిస్తుంటారట. ఎక్కువ మంది అమెరికన్లు తీసుకునే కొత్తసంవత్సర నిర్ణయం ఏమిటో తెలుసా? కొత్త ఏడాదిలో కొంతయినా బరువు తగ్గాలి అనేనట.