వైయస్ఆర్‌కు నివాళ్లుర్పించిన జగన్
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఆరో వర్ధంతిని పురస్కరించుకుని కడప జిల్లా ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ కుమారుడు జగన్మోహనరెడ్డి ఆయన కుటుంబసభ్యులు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం వైఎస్ సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిల, జగన్ భార్య భారతిలతో […]
BY sarvi2 Sept 2015 8:16 AM IST
X
sarvi Updated On: 2 Sept 2015 8:24 AM IST
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఆరో వర్ధంతిని పురస్కరించుకుని కడప జిల్లా ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ కుమారుడు జగన్మోహనరెడ్డి ఆయన కుటుంబసభ్యులు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం వైఎస్ సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిల, జగన్ భార్య భారతిలతో కలిసి తన సొంత ఎస్టేట్ ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పించారు. వైయస్ఆర్ వర్ధింతి సందర్భంగా వేలాది మంది ఆయన సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించి పుష్పగచ్చాలు ఉంచారు. అనంతరం ప్రార్థనలు చేశారు. నివాళులు అర్పించినవారిలో వైఎస్ఆర్ సోదరి వైఎస్ విమలమ్మ, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ సుధాకర్ రెడ్డి, వైఎస్ పురుషోత్తమరెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు తదితరులు ఉన్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
హైదరాబాద్‌లో వైఎస్‌కు ఘన నివాళి..!
మహానేత, దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరవ వర్థంతి కార్యక్రమం..హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్రకార్యాలయంలో నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి పంజాగుట్ట చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలు విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్ తదితరులు …అక్కడ వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆతర్వాత అసెంబ్లీకి వెళ్లారు. ఈసందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ..వై ఎస్ రాజశేఖర్ రెడ్డి లేని లోటు రెండు రాష్ట్రాల్లో తీవ్రంగా కనిపిస్తోందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఘనత మహానేత వైఎస్ దే అన్నారు. పేద ప్రజలకు మేలు చేకూరేలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రతికుటుంబంలో సభ్యుడిగా నిలిచారని ఉమ్మారెడ్డి గుర్తు చేశారు. అసెంబ్లీ లాంజ్ లో తొలగించిన వైఎస్ చిత్రపటాన్ని తిరిగి యథాస్థానంలో ఉంచాలని ఉమ్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Next Story