ముగ్గురు విద్యార్థుల ప్రాణాలు తీసిన అతి వేగం!
హైదరాబాద్ శివారులోని నాగారం ఇంజినీరింగ్ కళాశాలలో బి.టెక్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు బైక్‌పై వేగంగా వెళుతూ ప్రమాదవశాత్తూ దుర్మరణం పాలయ్యారు. ఈ ముగ్గురు విద్యార్థులు బుధవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఒకే బైక్ వెళుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. వీరంతా ఆదిలాబాద్ జిల్లాలోని ఒకే గ్రామానికి చెందినవారిగా చెబుతున్నారు. మౌలాలీ పెట్రోల్ బంక్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో విద్యార్థులు ముగ్గురు ఒక బైక్ పై వెళుతుండగా, రోడ్ డివైడర్‌ను డీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారని […]
BY sarvi2 Sept 2015 4:46 AM IST
X
sarvi Updated On: 2 Sept 2015 7:44 AM IST
హైదరాబాద్ శివారులోని నాగారం ఇంజినీరింగ్ కళాశాలలో బి.టెక్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు బైక్‌పై వేగంగా వెళుతూ ప్రమాదవశాత్తూ దుర్మరణం పాలయ్యారు. ఈ ముగ్గురు విద్యార్థులు బుధవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఒకే బైక్ వెళుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. వీరంతా ఆదిలాబాద్ జిల్లాలోని ఒకే గ్రామానికి చెందినవారిగా చెబుతున్నారు. మౌలాలీ పెట్రోల్ బంక్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో విద్యార్థులు ముగ్గురు ఒక బైక్ పై వెళుతుండగా, రోడ్ డివైడర్‌ను డీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. వీరిని ప్రభుదేవ్, వెంకటేష్, సురేష్‌లుగా గుర్తించారు. ఈ ముగ్గురు ఒకే గ్రామానికి చెందినవారు. అతి వేగం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. విద్యార్థులు అతివేగంగా వెళుతూ ప్రాణాలు పోతాయన్న భయాన్ని కూడా వీడి బైక్‌లు నడుపుతున్నారని, ఈ పోకడల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.
Next Story