Telugu Global
NEWS

కేబినెట్‌ హోదా ఇవ్వడం సరికాదు: హైకోర్టు

ఎవరికి పడితే వారికి కేబినెట్‌ హోదా ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంచేసింది. ఎవరికైనా జీత భత్యాలు ఇచ్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కేబినెట్‌ హోదాలు ఇవ్వరాదని తెలిపింది. కేబినెట్‌ హోదా, జీతభత్యాలు వేరని ఈ రెండింటికీ ముడిపెట్టొద్దని తేల్చి చెప్పింది. ప్రభుత్వ సలహాదారులకు, ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులకు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు కేబినేట్‌ హోదా కల్పిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాల్‌ చేస్తూ నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి జూన్‌లో హైకోర్టులో ప్రజాహిత […]

కేబినెట్‌ హోదా ఇవ్వడం సరికాదు: హైకోర్టు
X
ఎవరికి పడితే వారికి కేబినెట్‌ హోదా ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంచేసింది. ఎవరికైనా జీత భత్యాలు ఇచ్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కేబినెట్‌ హోదాలు ఇవ్వరాదని తెలిపింది. కేబినెట్‌ హోదా, జీతభత్యాలు వేరని ఈ రెండింటికీ ముడిపెట్టొద్దని తేల్చి చెప్పింది. ప్రభుత్వ సలహాదారులకు, ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులకు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు కేబినేట్‌ హోదా కల్పిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాల్‌ చేస్తూ నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి జూన్‌లో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి.భోసాలే, జస్టిస్‌ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం మరోమారు విచారణ జరిపింది. ఈ సందర్భంగా అడ్వొకేట్‌ జనరల్‌ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ… ‘నిబంధనల మేరకే కేబినెట్‌ హోదా కల్పించాం. తగిన జీతాలు, సౌకర్యాలు కల్పించేందుకే హోదా ఇవ్వాల్సి వచ్చింది’ అని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ… ‘కావాలంటే జీతాలు ఇచ్చుకోవచ్చు. సౌకర్యాలు కల్పించుకోవచ్చు. అంతే తప్ప ఎవరికి పడితే వారికి కేబినెట్‌ హోదా ఇవ్వకూడదు’ అని ఆదేశించింది.
First Published:  2 Sept 2015 4:49 AM IST
Next Story