Telugu Global
Others

చీప్‌ లిక్కర్‌పై వెనక్కి తగ్గిన కేసీఆర్‌ ప్రభుత్వం

చీప్‌ లిక్కర్‌ ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని ఈ యేడాదికి తమ ప్రభుత్వం వాయిదా వేసిందని, ఆర్టీసీని జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశం వివరాలను కేసీఆర్‌ పాత్రికేయులకు వివరించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. గృహ నిర్మాణం, ఆర్టీసీ నష్టాల భర్తీ తదితర విషయాల్లో స్పష్టమైన అవగాహనతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆయన అన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల రీడిజైన్‌పై ప్రతిపక్షాలది […]

చీప్‌ లిక్కర్‌పై వెనక్కి తగ్గిన కేసీఆర్‌ ప్రభుత్వం
X

చీప్‌ లిక్కర్‌ ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని ఈ యేడాదికి తమ ప్రభుత్వం వాయిదా వేసిందని, ఆర్టీసీని జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశం వివరాలను కేసీఆర్‌ పాత్రికేయులకు వివరించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. గృహ నిర్మాణం, ఆర్టీసీ నష్టాల భర్తీ తదితర విషయాల్లో స్పష్టమైన అవగాహనతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆయన అన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల రీడిజైన్‌పై ప్రతిపక్షాలది అవగాహన రాహిత్యమని, దీన్ని కొనసాగించి తీరాలన్నది తమ అభిమతమని ఆయన చెప్పారు. అపోహలు మానుకోవాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. ఉద్యోగుల విభజన 75 శాతం పూర్తయ్యిందని, ఇది సంపూర్ణమైన తర్వాత కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరన విషయాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ అధ్యక్షతన కమిటీ వేస్తున్నామని, దీనిపై నివేదిక వచ్చిన వెంటనే జిల్లాలను ప్రకటిస్తామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు నిర్వహిస్తామని ప్రకటించారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు…
1. కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం. నలుగురు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులతో కమిటీ
2. రూ. 3900 కోట్లతో 60 వేల డబుల్‌ బెడ్‌రూంల నిర్మాణం
3. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పదేళ్ళ పెంపు
4. పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ. 5.3 లక్షలు వెచ్చించి నిర్మిస్తాం
5. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 23 నుంచి 6 రోజులపాటు
6. మహబూబ్‌నగర్‌ జిల్లాలో వ్యవసాయ యూనివర్శిటీ ఏర్పాటు
7. జీహెచ్‌ఎంసీలో ఆర్టీసీ విలీనం
8. హైదరాబాద్‌లో ఆర్టీసీ నష్టాల బాధ్యత జీహెచ్‌ఎంసీకి అప్పగింత
9. ఆర్టీసీ బోర్డు డైరెక్టర్లలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ప్రాతినిధ్యం
10. గుడుంబాను అరికట్టడానికి సమర్ధ చర్యలు చేపడతాం
11. చీప్‌ లిక్కర్‌ను ఈ యేడాది అమలు చేయం
12. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్ని ఆదుకుంటాం
13. బీసీ స్టడీ సర్కిళ్ళలో సీట్లు 60 నుంచి 100కి పెంపు
14. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల రీ-డిజన్‌ను కొనసాగిస్తాం.
15. త్వరలో జల విధాన ప్రకటన… యేటా రూ. 25 వేల కోట్ల కేటాయింపు
16. జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ. 2300 కోట్లతో మల్టీ ఫ్లై-ఒవర్‌ల నిర్మాణ టెండర్లకు ఆమోదం
17. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ తప్పనిసరిగా చేస్తాం

First Published:  2 Sept 2015 3:21 PM IST
Next Story