ఈమధ్య కాలంలో సమంతకు నచ్చిన కథలివే..
ఏడాదికి కనీసం అరడజను సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది సమంత. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా వరుసగా సినిమాలు ఒప్పుకుంటోంది. అయితే కెరీర్ లో సినిమాలైతే చేస్తోంది కానీ, చుల్ బులీ మనసుకు నచ్చిన సినిమాలు మాత్రం కొన్నే ఉంటున్నాయి. అలా ఈమధ్య కాలంలో సమంతకు రెండు కథలు మాత్రమే నచ్చాయి. వీటిలో ఒకటి తమిళ సినిమా అయితే, ఇంకోటి తెలుగు మూవీ. మహేష్-సమంత కాంబినేషన్ లో త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న బ్రహ్మోత్సవం సినిమాను […]
BY admin2 Sept 2015 6:33 AM IST

X
admin Updated On: 2 Sept 2015 11:30 AM IST
ఏడాదికి కనీసం అరడజను సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది సమంత. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా వరుసగా సినిమాలు ఒప్పుకుంటోంది. అయితే కెరీర్ లో సినిమాలైతే చేస్తోంది కానీ, చుల్ బులీ మనసుకు నచ్చిన సినిమాలు మాత్రం కొన్నే ఉంటున్నాయి. అలా ఈమధ్య కాలంలో సమంతకు రెండు కథలు మాత్రమే నచ్చాయి. వీటిలో ఒకటి తమిళ సినిమా అయితే, ఇంకోటి తెలుగు మూవీ. మహేష్-సమంత కాంబినేషన్ లో త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న బ్రహ్మోత్సవం సినిమాను ఆకాశానికెత్తేస్తోంది సమంత. ఈ సినిమా కథ తనకు చాలా బాగా నచ్చిందని చెబుతోంది. ఇలాంటి కథలో, మంచి పాత్ర పోషించడం తన అదృష్టమంటోంది. అసలు పారితోషికం ఇవ్వకపోయినా ఈ సినిమాలో నటించేదాన్నని చెప్పుకొస్తోంది. సమంత మనసుకు నచ్చిన మరో కథ ఓ తమిళ సినిమా. వ్రస్తుతం విజయ్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమా కథ చాలా సున్నితమైన భావాలతో తెరకెక్కుతోందని చెప్పుకొచ్చింది. రాజా-రాణి లాంటి విలక్షణమైన సినిమా తీసిన ఆట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో కథే ప్రాణం అంటోంది సమంత. ప్రస్తుతం చుల్ బులీ మనసంతా ఈ రెండు సినిమాల చుట్టూనే తిరుగుతోంది.
Next Story