భారత్ బంద్‌కు మిశ్రమ స్పందన
దేశ వ్యాప్తంగా పది కార్మిక సంఘాల సమాఖ్య ఇచ్చిన భారత్ బంద్ పిలుపుకు మిశ్రమ స్పందనే లభించింది. ఉత్తర భారతంలో దీని ప్రభావం పెద్దగా కనిపించలేదు. 15 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కొన్నిచోట్ల బ్యాంకులు, ఫ్యాక్టరీలు, కళాశాలలు మూతపడ్డాయి. మరికొన్నిచోట్ల బంద్ పిలుపునకు స్పందనగా ప్రజారవాణా సంస్థ కార్మికులు విధులకు హాజరు కాలేదు. టాక్సీలు, ఆటోలు తిరగలేదు. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ప్రైవేట్ టాక్సీల డ్రైవర్లు డబ్బులు దండుకుంటున్నారని ప్రయాణీకులు వాపోయారు. […]
BY Pragnadhar Reddy2 Sept 2015 4:39 PM IST
X
Pragnadhar Reddy Updated On: 2 Sept 2015 4:39 PM IST
దేశ వ్యాప్తంగా పది కార్మిక సంఘాల సమాఖ్య ఇచ్చిన భారత్ బంద్ పిలుపుకు మిశ్రమ స్పందనే లభించింది. ఉత్తర భారతంలో దీని ప్రభావం పెద్దగా కనిపించలేదు. 15 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కొన్నిచోట్ల బ్యాంకులు, ఫ్యాక్టరీలు, కళాశాలలు మూతపడ్డాయి. మరికొన్నిచోట్ల బంద్ పిలుపునకు స్పందనగా ప్రజారవాణా సంస్థ కార్మికులు విధులకు హాజరు కాలేదు. టాక్సీలు, ఆటోలు తిరగలేదు. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ప్రైవేట్ టాక్సీల డ్రైవర్లు డబ్బులు దండుకుంటున్నారని ప్రయాణీకులు వాపోయారు.
ఎపి, తెలంగాణలలో సమ్మె ప్రభావం పాక్షికం
దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపు మేరకు జరిగిన సమ్మెకు పాక్షిక స్పందనే లభించింది. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక చట్టాలలో సవరణలు తేవడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా వామపక్షాలు, కార్మిక సంఘాలు ఈ సమ్మె నిర్వహించాయి. అనేకచోట్ల సమ్మె విజయవంతం అయినట్లు కార్మిక వర్గాల ప్రతినిధులు తెలియజేయగా కొన్నిచోట్ల మాత్రమే జరిగిందని సమాచారం అందింది. తెలంగాణలలో రవాణ వ్యవస్థకు ఆటంకం కలిగింది. బస్సులు తిరగలేదు. హైదరాబాద్‌లో పలుచోట్ల ఆటోలు కూడా నడవలేదు. సింగరేణిలో కార్మికులు సమ్మె చేయడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. చాలాచోట్ల బ్యాంకులు యధావిధిగానే పని చేశాయి. కొన్ని జిల్లాల్లో బస్సులను కార్మికులు అడ్డుకోవడంతో పోలీసులకు వారికి మధ్య తోపులాట జరిగింది. మొత్తంమీద బంద్ ప్రశాంతంగానే ముగిసింది.
PIC Credits Zee News
Next Story