గుంతల్లేని రోడ్డు చూపితే లక్ష: కిషన్ రెడ్డి
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధ్వాన్నంగా మారుస్తుందని తెలంగాణ భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఒకప్పుడు నెంబర్ ఒన్‌గా ఉన్న ఈ రాజధాని నగరం ఇపుడు 272వ స్థానానికి దిగజారిందని ఆయన విమర్శించారు. విశ్వనగరంగా మారుస్తామని ప్రగల్బాలు పలుకుతున్న టీఆర్‌ఎస్ నాయకులు పాలనలో ఇది దుర్భర నగరంగా మారుతుందని ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆరోపించారు. నగరంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా, నరకమయంగా తయారైందని అన్నారు. హైదరాబాద్‌లో ఒక్క రోడ్డు బాగున్నట్లు చూపగలిగితే తాను లక్ష […]
BY sarvi2 Sept 2015 7:35 AM IST
X
sarvi Updated On: 2 Sept 2015 7:35 AM IST
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధ్వాన్నంగా మారుస్తుందని తెలంగాణ భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఒకప్పుడు నెంబర్ ఒన్‌గా ఉన్న ఈ రాజధాని నగరం ఇపుడు 272వ స్థానానికి దిగజారిందని ఆయన విమర్శించారు. విశ్వనగరంగా మారుస్తామని ప్రగల్బాలు పలుకుతున్న టీఆర్‌ఎస్ నాయకులు పాలనలో ఇది దుర్భర నగరంగా మారుతుందని ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆరోపించారు. నగరంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా, నరకమయంగా తయారైందని అన్నారు. హైదరాబాద్‌లో ఒక్క రోడ్డు బాగున్నట్లు చూపగలిగితే తాను లక్ష రూపాయల బహుమతి ఇస్తానని కిషన్ రెడ్డి సవాల్ చేశారు. గ్రేటర్ పరిధిలో రోడ్లపై ఒక గుంత చూపితే వెయ్యి రూపాయలు ఇస్తామని గతంలో అదికారులు ప్రకటించారని, తాను దానికి వందరెట్లు అంటే లక్ష రూపాయల బహుమతి ఇస్తానని ప్రకటించారు.
Next Story