Telugu Global
Others

ఐఎస్ వికృతాల‌కు స‌జీవ సాక్ష్యం!

ఐఎస్ఐఎస్ వికృత చేష్ట‌ల‌కు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. గూఢ‌చ‌ర్యం చేస్తున్నార‌న్న అనుమానంతో న‌లుగురు ఇరాకీ యువ‌కుల‌ను అతి కిరాతంగా హ‌త్య చేశారు. ముందుగా వారికి నారింజ‌రంగు దుస్తులు తొడిగారు. అనంత‌రం వారిని తాళ్ల‌తో క‌ట్టి స్తంభాల‌కు త‌ల‌కిందులుగా వేలాడ‌దీశారు. వారి కింద పెట్రోలు కాలువ‌లు తీశారు. అందులో పెట్రోలు పోసి వాటికి నిప్పంటించారు. పాపం! ఆ యువ‌కులు మంట‌ల‌కు తాళ‌లేక ఆర్త‌నాదాలు చేస్తూ ప్రాణాలు విడిచారు. ఈ వీడియోను ఐఎస్ ఐఎస్ ఇంట‌ర్నెట్ లో పోస్ట్ […]

ఐఎస్ వికృతాల‌కు స‌జీవ సాక్ష్యం!
X

ఐఎస్ఐఎస్ వికృత చేష్ట‌ల‌కు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. గూఢ‌చ‌ర్యం చేస్తున్నార‌న్న అనుమానంతో న‌లుగురు ఇరాకీ యువ‌కుల‌ను అతి కిరాతంగా హ‌త్య చేశారు. ముందుగా వారికి నారింజ‌రంగు దుస్తులు తొడిగారు. అనంత‌రం వారిని తాళ్ల‌తో క‌ట్టి స్తంభాల‌కు త‌ల‌కిందులుగా వేలాడ‌దీశారు. వారి కింద పెట్రోలు కాలువ‌లు తీశారు. అందులో పెట్రోలు పోసి వాటికి నిప్పంటించారు. పాపం! ఆ యువ‌కులు మంట‌ల‌కు తాళ‌లేక ఆర్త‌నాదాలు చేస్తూ ప్రాణాలు విడిచారు. ఈ వీడియోను ఐఎస్ ఐఎస్ ఇంట‌ర్నెట్ లో పోస్ట్ చేశారు.

First Published:  1 Sept 2015 6:35 PM IST
Next Story