షీనా బోరా బతికే ఉందా?
లాయర్లను కలిసిన తరువాత ఇంద్రాణి తీరులో మార్పు కనిపిస్తోంది. ఆరు రోజుల క్రితం నేరాన్ని అంగీకరించిన ఇంద్రాణి ఇప్పుడు షీనా బతికే ఉందని బాంబు పేల్చింది. ప్రస్తుతం షీనా అమెరికాలో ఉంటుందని, తన చెల్లెలిగా ఇప్పటి వరకు తెలిసిన షీనా మరో కోణంలో సమాజానికి పరిచయం చేసుకోవడం ఇష్టం లేకనే.. ఇంత జరుగుతున్నా బయటికి రావడం లేదని, ప్రస్తుతం పోలీసు విచారణలో ఉన్న ఇంద్రాణి వెల్లడించింది. మూడు రోజులుగా ఇంద్రాణి పోలీసులకు సహకరించడం మానేసింది. తిక్క సమాధానాలు చెబుతూ, సంజీవ్ ఖన్నాను […]
BY sarvi2 Sept 2015 6:41 AM IST
X
sarvi Updated On: 2 Sept 2015 7:07 AM IST
లాయర్లను కలిసిన తరువాత ఇంద్రాణి తీరులో మార్పు కనిపిస్తోంది. ఆరు రోజుల క్రితం నేరాన్ని అంగీకరించిన ఇంద్రాణి ఇప్పుడు షీనా బతికే ఉందని బాంబు పేల్చింది. ప్రస్తుతం షీనా అమెరికాలో ఉంటుందని, తన చెల్లెలిగా ఇప్పటి వరకు తెలిసిన షీనా మరో కోణంలో సమాజానికి పరిచయం చేసుకోవడం ఇష్టం లేకనే.. ఇంత జరుగుతున్నా బయటికి రావడం లేదని, ప్రస్తుతం పోలీసు విచారణలో ఉన్న ఇంద్రాణి వెల్లడించింది. మూడు రోజులుగా ఇంద్రాణి పోలీసులకు సహకరించడం మానేసింది. తిక్క సమాధానాలు చెబుతూ, సంజీవ్ ఖన్నాను తిట్టడంతోనే విచారణ సమయాన్ని వృథా చేస్తోంది. తాజాగా షీనా బతికే ఉందని చెప్పడం వెనక కూడా లాయర్ల సూచనలు ఉన్నాయన్న అనుమానాలు చెలరేగుతున్నాయి. షీనా బోరాను తామే హతమార్చామని ఇప్పటికే ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్‌ఖన్నా, డ్రైవర్ శ్యాంవర్ రాయ్ అంగీకరించారు. కానీ, షీనా బతికే ఉందని ఇంద్రాణి చెప్పడాన్ని పోలీసులు విశ్వసించడం లేదు. ఎందుకైనా మంచిదని ఏప్రిల్ 24, 2012కు ముందు ఇండియా నుంచి అమెరికా వెళ్లిన ప్రయాణికుల జాబితాను పోలీసులు సేకరిస్తున్నారు. కోర్టుకు కేవలం నోటి మాట పనికి రాదు. భౌతికంగా షీనా హత్యకు గురైందని ఆధారాలు చూపించాలి. అప్పటిదాకా షీనా వ్యవహారాన్ని మిస్సింగ్ కేసుగానే కోర్టు పరిగణిస్తుంది. ఫోరెన్సిక్ రిపోర్టులో మృతదేహం ఎవరిది అన్నది నిర్ధారించడం సాధ్యపడకపోతే.. ఇంద్రాణి తప్పించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే డీఎన్ఏ పరీక్షలకు షీనా అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు పోలీసులు. ఇందుకోసం ఇంద్రాణి, మిఖాయిల్ రక్తపు శాంపిల్స్ కూడా తీసుకున్నారు.
Next Story