Telugu Global
Others

శేషాచలం అడవుల్ని జల్లెడ పడుతున్న పోలీసులు

ఎర్ర దొంగలు-పోలీసుల మధ్య భీకర పోరు ఎర్రచందనం స్మగ్లర్లు, పోలీసులకు మధ్య భీకర పోరు జరిగింది. తిరుమల సమీపంలో ఈ సంఘటన జరిగింది. దాదాపు రెండొందల మంది ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు రాళ్ల దాడి చేయడంతో పోలీసులు గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా నలుగురు స్మగ్లర్లు పోలీసులకు చిక్కారు. ఒక పోలీసు కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు వెళ్లే దారిలో పాత మండపం ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారని […]

శేషాచలం అడవుల్ని జల్లెడ పడుతున్న పోలీసులు
X
ఎర్ర దొంగలు-పోలీసుల మధ్య భీకర పోరు
ఎర్రచందనం స్మగ్లర్లు, పోలీసులకు మధ్య భీకర పోరు జరిగింది. తిరుమల సమీపంలో ఈ సంఘటన జరిగింది. దాదాపు రెండొందల మంది ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు రాళ్ల దాడి చేయడంతో పోలీసులు గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా నలుగురు స్మగ్లర్లు పోలీసులకు చిక్కారు. ఒక పోలీసు కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు వెళ్లే దారిలో పాత మండపం ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారని మంగళవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. 12 మంది రిజర్వు పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్ళి గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడినుంచి పశ్చిమ దిక్కున కిలోమీటరు దూరంలో ఈతమాకులగుంట ప్రాంతంలో స్మగ్లర్లు తారసపడ్డారు. పట్టుకోవడానికి ప్రయత్నించగా దాదాపు 200 మంది స్మగ్లర్లు వీరిని చుట్టుముట్టి రాళ్ల వర్షం కురిపించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. స్మగ్లర్లు ఆ చీకట్లో దట్టమైన అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశారు. నలుగురు స్మగ్లర్లు గాయపడి పోలీసులకు పట్టుబడ్డారు. వారిని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. దాదాపు 70 మంది రెండు టీమ్‌లుగా శేషాచలాన్ని జల్లెడ పడుతున్నారు. ఇరువర్గాలకు మధ్య జరిగిన దాడిలో సింహాద్రి అనే కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
First Published:  2 Sept 2015 8:09 AM IST
Next Story