పోలీసుశాఖలో మహిళలకు 33% రిజర్వేషన్
మహిళల రక్షణకు ప్రతి పోలీస్‌స్టేషన్‌లోనూ 33 శాతం మహిళా పోలీసులను నియమించనున్నామని, ఫిర్యాదుదారులకు మర్యాదిచ్చి వారి పని పూర్తి చేసి పంపించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. పోలీస్‌శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. జర్నలిస్టులకు, హోంగార్డులకు, డ్రైవర్లకు ప్రభుత్వమే రూ.1200 చెల్లించి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తుందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం పోలీస్‌శాఖ బలోపేతానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జంట […]
BY admin2 Sept 2015 1:56 AM IST
X
admin Updated On: 2 Sept 2015 7:28 AM IST
మహిళల రక్షణకు ప్రతి పోలీస్‌స్టేషన్‌లోనూ 33 శాతం మహిళా పోలీసులను నియమించనున్నామని, ఫిర్యాదుదారులకు మర్యాదిచ్చి వారి పని పూర్తి చేసి పంపించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. పోలీస్‌శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. జర్నలిస్టులకు, హోంగార్డులకు, డ్రైవర్లకు ప్రభుత్వమే రూ.1200 చెల్లించి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తుందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం పోలీస్‌శాఖ బలోపేతానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జంట నగరాలకే పరిమితం కాకుండా అన్ని పోలీస్‌స్టేషన్లకూ కొత్త వాహనాలు అందించి నట్లు చెప్పారు. త్వరలో రాష్ట్రంలో 9వేల పోలీస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు.
Next Story