మారనున్న గుట్ట రూపురేఖలు!
తెలంగాణ రాష్ర్టం వచ్చిన అనంతరం సీఎం కేసీఆర్ యాదాద్రి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇందుకోసం రూపొందించిన పనులను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా యాదగిరి గుట్టపై చేపట్టనున్న పలు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ప్రధాన దేవాలయ ప్రాంగణంతోపాటు నాలుగు మాడవీధులు, నాలుగు రాజగోపురాలకు సంబంధించిన డిజైన్లను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. డిజైన్లను పరిశీలించిన అనంతరం ఆయన అధికారులకు పలు […]
BY admin1 Sept 2015 5:46 AM IST
X
admin Updated On: 1 Sept 2015 5:46 AM IST
తెలంగాణ రాష్ర్టం వచ్చిన అనంతరం సీఎం కేసీఆర్ యాదాద్రి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇందుకోసం రూపొందించిన పనులను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా యాదగిరి గుట్టపై చేపట్టనున్న పలు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ప్రధాన దేవాలయ ప్రాంగణంతోపాటు నాలుగు మాడవీధులు, నాలుగు రాజగోపురాలకు సంబంధించిన డిజైన్లను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. డిజైన్లను పరిశీలించిన అనంతరం ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పనులు అనుకున్నట్లుగా పూర్తయితే గుట్ట రూపురేఖలు మారతాయనడంలో సందేహం లేదు.
సీఎం కేసీఆర్ సూచనలు:
1. ప్రకృతి అందాలు ఉట్టిపడేలా, ఆధ్యాత్మికత చెదరకుండా యాదగిరిగుట్ట ప్రాంతం తెలంగాణ రాష్ర్టానికే వన్నెతెచ్చేలా ఉండాలి.
2. ప్రస్తుతం గుహలో కొలువైన లక్ష్మీనరసింహ స్వామి మూల విరాట్ యథాతథంగానే ఉండాలని, మిగిలిన ప్రాంతమంతా ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి.
3. గుట్టపై ఏకకాలంలో 30 వేల మంది భక్తులు కలియ తిరిగినా ఇబ్బంది కలగని విధంగా నిర్మాణాలు ఉండాలి.
4. ప్రధాన గుట్ట చుట్టూ ఉన్న ఇతర గుట్టలను కూడా చక్కగా తయారు చేయాలి.
5. ఆలయం పవిత్రత దృష్ట్యా ప్రధాన ఆలయం చుట్టూ మాడవీధులు ఉండాలి.
6. అతిథి గృహాలు, కాటేజీలు, అందమైన ఉద్యానవనాలు, విశాలమైన రోడ్లు, గుట్టపైకి వచ్చి వెళ్లడానికి వేర్వేరుగా దారులు ఉండాలి.
7. గుట్ట కింది భాగంలో 2500 మంది కూర్చునే విధంగా కళ్యాణ మంటపం నిర్మించాలి.
8. యాదగిరిగుట్ట సమీంలోని బస్వాపూర్ చెరువును పెద్ద రిజర్వాయర్‌గా మార్చాలి .
9. రిజర్వాయర్‌కు అనుబంధంగా మైసూర్ బృందావన్ గార్డెన్ తరహాలో థీమ్‌పార్క్ నిర్మించాలి.
10 యాదగిరిగుట్ట ప్రాంతమంతా సెంట్రలైజ్డ్ మైక్ సిస్టం ఏర్పాటు చేయాలని, నిత్యం స్తోత్రాలు వినిపించాలి.
11. భక్తులకు సరిపడే విధంగా మంచినీటి సరఫరా ఉండాలని, మెరుగైన మురుగునీటి నిర్వహణ ఉండాలి
Next Story