Telugu Global
Others

4 వేల కిలోల ఉల్లిపాయలు దొంగతనం

ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నందున వాటిని దొంగతనం చేసి అమ్మడం ద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చనే దురాశ కొత్త దొంగలను తయారు చేస్తోంది. తాజాగా రాజస్థాన్‌లో ఓ దుకాణంలో 4 వేల కిలోల ఉల్లి నిల్వలు దొంగతనం జరిగింది. రంగంలో దిగిన పోలీసులు కేసును వెంటనే పరిష్కరించారు. దొంగతనానికి పాల్పడిన ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. ఉల్లిపాయల వ్యాపారికి స్థలాన్ని ఇచ్చిన ఓ మహిళ….ఆ ప్రాంతానికి వాచ్‌మెన్‌గా ఉన్న వ్యక్తి కలిసి ఈ దొంగతానికి పాల్పడినట్లు పోలీసులు కనుగొన్నారు. వీరిద్దరికీ […]

4 వేల కిలోల ఉల్లిపాయలు దొంగతనం
X
ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నందున వాటిని దొంగతనం చేసి అమ్మడం ద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చనే దురాశ కొత్త దొంగలను తయారు చేస్తోంది. తాజాగా రాజస్థాన్‌లో ఓ దుకాణంలో 4 వేల కిలోల ఉల్లి నిల్వలు దొంగతనం జరిగింది. రంగంలో దిగిన పోలీసులు కేసును వెంటనే పరిష్కరించారు. దొంగతనానికి పాల్పడిన ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. ఉల్లిపాయల వ్యాపారికి స్థలాన్ని ఇచ్చిన ఓ మహిళ….ఆ ప్రాంతానికి వాచ్‌మెన్‌గా ఉన్న వ్యక్తి కలిసి ఈ దొంగతానికి పాల్పడినట్లు పోలీసులు కనుగొన్నారు. వీరిద్దరికీ ఇంతకుముందు దొంగతనం చేసిన అనుభవం లేనందునే వెంటనే దొరికిపోయారు. వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
First Published:  31 Aug 2015 6:42 PM IST
Next Story