తూర్పు జయప్రకాష్‌రెడ్డికి సొంతిళ్ళు ఎక్కువ!
దేశంలో పార్టీ మారడం కొత్త విషయమేం కాదు. అధికారంలోకి వస్తామనుకుంటే.. అప్పటి దాకా తల్లిలా ఆదరించిన పార్టీని నాలుగు తిట్లు తిట్టి, కొద్దిసేపు ఏడ్చి, ముక్కుచిదుముకుని తాము అనుకున్న పార్టీలో చేరడం సంప్రదాయంలా మారింది. అధికారం దక్కుతుందంటే.. అప్పటి దాకా చొక్కాలు పట్టుకుని కొట్టుకున్న వారైనా మరునాడు పార్టీలో చేరి చేయి చేయి కలుపుకుంటారు. తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి విషయంలో కొంచెం భిన్నంగా ఆలోచించవచ్చు. ఎందుకంటే ఆయనకు సొంతిళ్ళు ఎక్కువ. ఆయన ఏ పార్టీలో చేరినా […]
BY admin1 Sept 2015 5:29 AM IST
X
admin Updated On: 1 Sept 2015 7:28 AM IST
దేశంలో పార్టీ మారడం కొత్త విషయమేం కాదు. అధికారంలోకి వస్తామనుకుంటే.. అప్పటి దాకా తల్లిలా ఆదరించిన పార్టీని నాలుగు తిట్లు తిట్టి, కొద్దిసేపు ఏడ్చి, ముక్కుచిదుముకుని తాము అనుకున్న పార్టీలో చేరడం సంప్రదాయంలా మారింది. అధికారం దక్కుతుందంటే.. అప్పటి దాకా చొక్కాలు పట్టుకుని కొట్టుకున్న వారైనా మరునాడు పార్టీలో చేరి చేయి చేయి కలుపుకుంటారు. తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి విషయంలో కొంచెం భిన్నంగా ఆలోచించవచ్చు. ఎందుకంటే ఆయనకు సొంతిళ్ళు ఎక్కువ. ఆయన ఏ పార్టీలో చేరినా సొంతిట్లోకి వెళ్ళినట్టే ఉంటుంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్ళినా సొంతిల్లే… బీజేపీలోకి వెళ్ళినా సొంతిల్లే… చివరికి మళ్ళీ టీఆర్‌ఎస్‌లోకి వెళ్ళినా సొంతిల్లే. ఈయన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే. ఈయన ప్రజా సేవ కంటే వివాదాలతోనే నిత్యం వార్తల్లో ఉంటాడు. 2004కు ముందు బీజేపీ కౌన్సిలర్‌గా ఈయన తన రాజకీయ జీవితం ప్రారంభించాడు. వెంటనే మున్సిపల్ ఛైర్మన్ అయ్యాడు. తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి గాలి వీచింది. అంతే టీఆర్ఎస్‌లోకి దూకారు. స్వతహాగా దూకుడు స్వభావం, అంగబలం, అర్ధబలం ఉన్న జగ్గారెడ్డికి విజయం నల్లేరు మీద నడకే అయింది. హైదరాబాద్ పరిధిని అప్పట్లో సీఎం వైఎస్ సంగారెడ్డి వరకు విస్తరించారు. దీంతో అక్కడి భూములకు ధరలు పెరిగిపోయాయి. ఔటర్ రింగురోడ్డు రాకతో అది రెండింతలైంది. దీంతో టీఆర్ఎస్‌కు టాటా చెప్పకుండానే తిరుగుబాటు బావుటా ఎగరేశారు. కాంగ్రెస్‌తో నాలుగేళ్లు రాసుకుపూసుకు తిరిగారు. 2009లో తిరిగి సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ హఠాన్మరణంతో దూకుడు తగ్గించారు. సీఎం కిరణ్‌కు దగ్గరయ్యారు. ఈ సమయంలో ఆయన పలు మార్లు వివాదస్పద సంఘటనలో నిత్యం వార్తల్లో నిలిచాడు. అంతేకాకుండా.. 2014 ఎన్నికల్లో ఆయన ఈసీ నిబంధనలు ఉల్లంఘించారు. సికింద్రాబాద్‌లోని ఆ ఫంక్షన్ హాల్ ఓటర్లకు బహుమతులు పంచుతూ మీడియాకు అడ్డంగా దొరికిపోయాడు. ఆ కేసు విచారణలో ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు 2014 ఎన్నికల్లో ఓటమికి కారణమయ్యాయి. ప్రజలు అధికారానికి దూరంగా పెట్టడంతో ఏం చేయాలో పాలుపోలేదు. ఈ లోగా మెదక్ ఎంపీ స్తానానికి కేసీఆర్ రాజీనామా చేశారు. ప్రజల్లో కాంగ్రెస్‌పై అపుడు వ్యతిరేకత ఉంది. వెంటనే పవన్ కల్యాణ్‌ను కలిశారు. బీజేపీలో చేరిపోయారు. నిన్న కాంగ్రెస్‌లోకి చేరినపుడు సొంత ఇంటికి వచ్చినట్లుంది అని వాఖ్యానించారు. గతేడాది కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరినపుడు ఈవ్యాఖ్యలే చేశారు. వేదిక మారింది అంతే! అయితే, ప్రజలు ఆదరించకపోవడంతో కేవలం రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మెదక్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడి 11 నెలలు మాత్రమే అవుతోంది. అంతలోనే మరోసారి పార్టీ మారాడు జగ్గారెడ్డి. రాజకీయ నాయకులే కాదు.. పార్టీలు కూడా విలువలు పాటించడం లేదు.
Next Story