22 సంవత్సరాల తరువాత శ్రీలంకలో భారత్ గెలుపు
కొలంబో వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 22 యేళ్ళ తర్వాత భారత్ శ్రీలంక గడ్డపై గెలిచింది. ఈ గెలుపు కూడా ఆషామాషి గెలుపు కాదు. 117 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. మాథ్యూస్ సెంచరీతో భారత్ విజయం కాస్త ఆలస్యం అయింది.సమయోచిత సెంచరీతో భారత శిబిరంలో గుబులు రేపిన మాథ్యూస్ జట్టు స్కోరు 249 పరుగుల వద్ద అవుటయ్యాడు. దీనితో మ్యాచ్ తమ చేజారుతుందా అని కలవర పడ్డ టీమిండియా […]
కొలంబో వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 22 యేళ్ళ తర్వాత భారత్ శ్రీలంక గడ్డపై గెలిచింది. ఈ గెలుపు కూడా ఆషామాషి గెలుపు కాదు. 117 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. మాథ్యూస్ సెంచరీతో భారత్ విజయం కాస్త ఆలస్యం అయింది.సమయోచిత సెంచరీతో భారత శిబిరంలో గుబులు రేపిన మాథ్యూస్ జట్టు స్కోరు 249 పరుగుల వద్ద అవుటయ్యాడు. దీనితో మ్యాచ్ తమ చేజారుతుందా అని కలవర పడ్డ టీమిండియా ఊపిరి పీల్చుకుంది. మాథ్యూస్ 110 పరుగులు చేసి అవుటయ్యాడు. మాథ్యూస్‌ను ఇషాంత్ శర్మ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 2-1 తేడాతో టెస్ట్ సిరీస్‌ను భారత్ చేజిక్కించకుంది. చివరిసారిగా 1993లో భారత్ టెస్ట్ సిరీస్ గెలిచింది. ఇపుడు మళ్ళీ విజయం కైవసమయ్యింది.