Telugu Global
NEWS

విజ్ఞాన మిసైల్‌ కలాంకు అసెంబ్లీ నివాళులు

రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం దేశానికి వన్నె తెచ్చే పనులు అనేకం చేశారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అన్నారు. కలాం మరణానికి సంతాపం తెలిపే తీర్మానంపై శాసనసభలో చంద్రబాబు మాట్లాడారు. గత ఎన్.డి.ఎ. హయాంలో రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరన్న చర్చ జరిగినప్పుడు తాను కూడా కలాం పేరు సూచించానని తెలిపారు. తాము విజన్ 2020 డాక్యుమెంట్‌ను తయారు చేసినప్పుడు ఆయన దానిని ఆవిష్కరించారని చంద్రబాబు తెలిపారు. తనపై అలిపిరిలో దాడి జరగ్గా ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి తనను పరామర్శించారని […]

విజ్ఞాన మిసైల్‌ కలాంకు అసెంబ్లీ నివాళులు
X
రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం దేశానికి వన్నె తెచ్చే పనులు అనేకం చేశారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అన్నారు. కలాం మరణానికి సంతాపం తెలిపే తీర్మానంపై శాసనసభలో చంద్రబాబు మాట్లాడారు. గత ఎన్.డి.ఎ. హయాంలో రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరన్న చర్చ జరిగినప్పుడు తాను కూడా కలాం పేరు సూచించానని తెలిపారు. తాము విజన్ 2020 డాక్యుమెంట్‌ను తయారు చేసినప్పుడు ఆయన దానిని ఆవిష్కరించారని చంద్రబాబు తెలిపారు. తనపై అలిపిరిలో దాడి జరగ్గా ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి తనను పరామర్శించారని గుర్తు చేశారు. ఒంగోలులో ఏర్పాటయ్యే త్రిబుల్ ఐటికి కలాం పేరు పెడుతున్నామని తెలిపారు. ప్రతిభ కలిగిన విద్యార్దులకు పురస్కాలకు అబ్దుల్ కలాం పేరు పెడుతున్నామని చంద్రబాబు చెప్పారు. నాగార్జున యూనివర్శిటీలో కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఆయన మరణించినప్పుడు ఆయన కోరిక మేరకు తమ ప్రభుత్వం సెలవు ఇవ్వలేదని, అదనంగా గంట పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. సంతాప తీర్మానంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్‌ మాట్లాడుతూ కలాం వంటి గొప్ప వ్యక్తులు యుగానికి ఒక్కరు ఉంటారని అన్నారు. ప్రపంచానికే అలాంటి వారు ఆదర్శవంతమైన వారు అని అన్నారు. మత్స్యకార కుటుంబంలో పుట్టి, అంతరిక్ష విజ్ఞానంలో అద్బుతమైన విజయం సాదించిన గొప్ప వ్యక్తి కలాం అని అన్నారు. రాష్ట్రపతి పదవి తర్వాత కూడా ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లిన మహోపాధ్యాయుడు కలాం అని శ్లాఘించారు. చివరికి చదువల తల్లి ఒడిలోనే ఒదిగారని ఆయన అన్నారు.
First Published:  31 Aug 2015 2:24 AM GMT
Next Story