ముగ్గురు సోదరులు (For Children)
జీలం నది ఒడ్డున ఒక గ్రామంలో ముగ్గురు సోదరులు ఉండేవాళ్ళు. వాళ్ళ ముగ్గురు ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవాళ్ళు. కారణం వాళ్ళ ఇష్టాయిష్టాలు. పెద్దవాడు ఏదయినా అయిష్టమయింది భోజనం దగ్గరుంటే నా ఆకలి కాస్తా చచ్చిపోతుంది. భోజనం ముట్టను. అనారోగ్యం పాలవుతాను అనేవాడు. రెండోవాడు నీకు అయిష్టమైన వస్తువు లెట్లాగో నాకు ఇష్టంలేని వాటిని వాసన పట్టి చెప్పేస్తాను. నీకన్నా నేనే గొప్ప అన్నాడు. మూడోవాడు ‘మీరు తిండి, వాసన గురించి చెప్పారు. నేను పడుకున్న పరుపు […]
జీలం నది ఒడ్డున ఒక గ్రామంలో ముగ్గురు సోదరులు ఉండేవాళ్ళు. వాళ్ళ ముగ్గురు ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవాళ్ళు. కారణం వాళ్ళ ఇష్టాయిష్టాలు.
పెద్దవాడు ఏదయినా అయిష్టమయింది భోజనం దగ్గరుంటే నా ఆకలి కాస్తా చచ్చిపోతుంది. భోజనం ముట్టను. అనారోగ్యం పాలవుతాను అనేవాడు. రెండోవాడు నీకు అయిష్టమైన వస్తువు లెట్లాగో నాకు ఇష్టంలేని వాటిని వాసన పట్టి చెప్పేస్తాను. నీకన్నా నేనే గొప్ప అన్నాడు.
మూడోవాడు ‘మీరు తిండి, వాసన గురించి చెప్పారు. నేను పడుకున్న పరుపు కింద చిన్ని రాయి ఉన్నా నాకు నిద్ర పట్టదు. అంత సుకుమారుణ్ణి నేను’ అన్నాడు.
ఎవరు గొప్ప? అన్నది వాళ్ళ మధ్య సమస్య అయి కూచున్నది. ముగ్గురూ కలిసి రాజు దగ్గరకు వెళ్ళారు. రాజు వాళ్ల ప్రతిభకు పరీక్ష పెడతాను. అంతవరకు మా అతిథి గృహంలో ఉండండి అన్నాడు.
ఒక సందర్భంలో రాజు పెద్ద విందు ఏర్పాటుచేశాడు. పెద్దపెద్ద వాళ్ళందర్నీ ఆ విందుకు ఆహ్వానించాడు. ముగ్గురు సోదరుల్ని కూడా పిలిచాడు.
రాణికి ఒక పెంపుడు తాబేలు ఉంది. అతిథుల మధ్య అది కూడా ఉంది. ఆ తాబేలు అటూఇటూ మెల్లగా పాకుతూ మొదటి సోదరుడి పాదాల్ని తాకింది. దాంతో అతను కళ్లు తిరిగినంత పనయి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రెండురోజుల పాటు అనారోగ్యం పాలయ్యాడు. అతని సున్నితత్వం చూసి రాజు ఆశ్చర్యపోయాడు.
ఆ విందుకు రాజు చెల్లెలు కూడా వచ్చింది. ఆమె పక్కనే రెండో సోదరుడు కూచున్నాడు. కానీ వెంటనే ముక్కు మూసుకున్నాడు. ఆమెను అవమానించినట్లయింది. ఎందుకలా ముక్కు మూసుకున్నావని రాజు అడిగితే ఇక్కడ మేక వాసన వస్తోంది అన్నాడు.
అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ మేకలేదు. ఇంతకూ విషమేమింటంటే ఆరాజు చెల్లెలు చిన్నప్పుడు మేకపాలు తాగి పెరిగిందట! అంత గ్రహణశక్తికి రాజు విస్తుపోయాడు.
మూడోసోదరుడు రాత్రి రాజు అమర్చిన ఏడుపరుపుల మీద పడుకున్నాడు. సరిగా నిద్రపట్టలేదు. అతని వీపుపై మచ్చలాగా ఏర్పడింది. సేవకులు ఉదయాన్నే ఏడుపరుపులు తొలగించి చూశారు. కింద ఒక వెండినాణెం ఉంది. రాజు ఆ మూడో సోదరుని సున్నితత్వానికి విస్తుపోయాడు.
మరుసటిరోజు రాజు ముగ్గురు సోదరుల్ని పిలిచి ‘మీ సున్నితత్వాలతో ముగ్గురూ నన్ను ఆట్టుకున్నారు. ఆశ్చర్యపరిచారు. ఈ బహుమానాలతో మిమ్మల్ని సత్కరిస్తున్నాను’ అని మూడు సంచుల రూపాయలను వారికి అందజేశాడు.
సోదరులు సంతోషంతో రాజు సత్కారాన్ని అందుకున్నారు.
– సౌభాగ్య