స్పీకర్... ప్రభుత్వం... మాట, బాట ఒకేలా
పక్షపాతానికి, రాగ ద్వేషాలకు అతీతంగా ఉండి సభను నడిపించాల్సిన స్పీకర్ ప్రభుత్వం ఎలా వెళితే అలాగే నడుస్తూ సభా సంప్రదాయాల్ని మంట గలపడం పరిపాటిగా మారిపోయింది. గత అసెంబ్లీ సమావేశాల్లో ఇదే విషయంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌పై ఒంటి కాలిపై లేచింది. విపక్ష గళం నొక్కేస్తున్నారని, అధికారపార్టీకి వంతపాడుతున్నారని ఆ పార్టీ స్పీకర్ తీరుపై విరుచుకు పడింది. దాంతో స్పీకర్ సభ చివరి రోజు తనకు అందరూ సమానమేనని, ఏ పార్టీ వైపు తలొగ్గాల్సిన అవసరం […]
BY sarvi31 Aug 2015 9:55 AM IST
X
sarvi Updated On: 31 Aug 2015 4:37 PM IST
పక్షపాతానికి, రాగ ద్వేషాలకు అతీతంగా ఉండి సభను నడిపించాల్సిన స్పీకర్ ప్రభుత్వం ఎలా వెళితే అలాగే నడుస్తూ సభా సంప్రదాయాల్ని మంట గలపడం పరిపాటిగా మారిపోయింది. గత అసెంబ్లీ సమావేశాల్లో ఇదే విషయంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌పై ఒంటి కాలిపై లేచింది. విపక్ష గళం నొక్కేస్తున్నారని, అధికారపార్టీకి వంతపాడుతున్నారని ఆ పార్టీ స్పీకర్ తీరుపై విరుచుకు పడింది. దాంతో స్పీకర్ సభ చివరి రోజు తనకు అందరూ సమానమేనని, ఏ పార్టీ వైపు తలొగ్గాల్సిన అవసరం తనకు లేదని నమ్మబలికారు. దాంతో వివాదం కాస్తా సద్దుమణిగి మామూలు స్థితికి వచ్చింది. మళ్ళీ ఈరోజు మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ తీరులో మళ్ళీ పాత వాసనలే గుభాళించాయి. అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏమి మాట్లాడినా, విపక్షంపై ఎన్ని ఆరోపణలు చేసినా స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా అవకాశాలు ఇవ్వడం ఈరోజు కంటికి కనిపించిన నిజం. గత శాసనసభ సమావేశాలలో కూడా మొదట ఇదే తరహాలో స్పీకర్ అవకాశాలు ఇచ్చారని విమర్శలు వచ్చినా, ఆ తర్వాత ఆయన సాద్యమైనంత వరకు పక్షపాత రహితంగా వ్యవహరించారన్న అబిప్రాయం కలిగించగలిగారు. కాని మళ్లీ వర్షాకాల సమావేశాల మొదటి రోజు ప్రత్యేక హోదాపై చంద్రబాబు ప్రకటన చేసిన సందర్భంలో వివాదం చోటు చేసుకుంది. విభజనకు సంబంధించిన అంశాలు ప్రస్తావించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ యుపిఎపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో వెనక్కి తగ్గిందంటూ ఆరోపణ చేసి మొత్తం అంశాన్ని చంద్రబాబు అటు మళ్లించారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ తమకు అవకాశం ఇవ్వాలని అడిగితే అందుకు చంద్రబాబు ససేమిరా అన్నారు. స్పీకర్ కూడా అదే బాటలో నడిచారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆ సమయంలో టిడిపి ఎమ్మెల్యేలు పలువురికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. వారు విపక్షాన్ని, జగన్ను తీవ్రంగా విమర్శిస్తూ మాట్లాడినా ఏ మాత్రం అభ్యంతరం చెప్పలేదు. ఒక్కసారి మాత్రం మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ఒక వ్యాఖ్యను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటనకు మద్యలో ఎవరూ అడ్డుపడకూడదన్న సూత్రం పాటించదలిస్తే టిడిపి ఎమ్మెల్యేలకు మాత్రం ఎలా అవకాశం ఇస్తారన్నది చర్చనీయాంశం అవుతుంది. అయినా అధికార పార్టీ శాసనసభను ఎలా ముందుకు తీసుకువెళితే స్పీకర్ కూడా అదే దారిలో నడిపించడం ఇటీవల కాలంలో ఆనవాయితీగా మారిపోయింది.
నేను మాట్లాడితే మైక్ కట్ చేస్తారా: జగన్
తాను మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారని ఎపి శాసనసభలో విపక్ష నేత జగన్ విమర్శించారు. మా దురదృష్టం ఏమిటంటే ఈ శాసనసభ లైవ్ కవరేజీ హక్కులు ఎబిఎన్ ఆంద్రజ్యోతికి ఇచ్చారని వారు చంద్రబాబుకు తప్ప తమకు మైక్ ఇవ్వకుండా కట్ చేస్తారని, ఒకవేళ మైకు చేతికి దొరికితే దానికి ప్రసారాల్లో వాయిస్ లేకుండా చేస్తారని జగన్ ఆరోపించారు. చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నప్పుడు మైక్ కట్ అయింది. దాంతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లు నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడడానికి లేవగా వీరు అభ్యంతరం తెలిపారు. ఒకవైపు స్పీకర్, మరోవైపు ఆంధ్రజ్యోతి ప్రసారాల వల్ల అసెంబ్లీలో తమ వాయిస్ జనం దగ్గరకు వెళ్ళడం లేదని ఆయన ఆరోపించారు.

Next Story