Telugu Global
NEWS

అసెంబ్లీ ప్రాంగణంలో రోజా సెటైర్లు!

అసెంబ్లీ సమావేశాలు మొదటిరోజు గరంగరంగా జరిగాయి. సంతాపాలు తెలిపిన అనంతరం తొలిసారి సమావేశాన్ని 10 నిమషాలసేపు వాయిదా వేశారు. ఈ సమయంలో రోజా అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్‌ దగ్గర మాట్లాడుతూ కొన్ని సెటైర్లు వేశారు. సంతాపం సందర్భంగా అబ్దుల్ కలాం ఎక్కడ పుట్టారు… ఏ అవార్డులు అందుకున్నారో చెప్పినప్పుడు, గోదావరి పుష్కరాల మృతులు అక్కడకు ఎందుకు వచ్చారు, ఎలా చనిపోయారో చంద్రబాబు చెప్పవద్దా అని సెటైర్‌ వేశారు. తాము గోదావరి పుష్కరాలకు అన్ని సదుపాయాలు కల్పించామని, […]

అసెంబ్లీ ప్రాంగణంలో రోజా సెటైర్లు!
X
అసెంబ్లీ సమావేశాలు మొదటిరోజు గరంగరంగా జరిగాయి. సంతాపాలు తెలిపిన అనంతరం తొలిసారి సమావేశాన్ని 10 నిమషాలసేపు వాయిదా వేశారు. ఈ సమయంలో రోజా అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్‌ దగ్గర మాట్లాడుతూ కొన్ని సెటైర్లు వేశారు. సంతాపం సందర్భంగా అబ్దుల్ కలాం ఎక్కడ పుట్టారు… ఏ అవార్డులు అందుకున్నారో చెప్పినప్పుడు, గోదావరి పుష్కరాల మృతులు అక్కడకు ఎందుకు వచ్చారు, ఎలా చనిపోయారో చంద్రబాబు చెప్పవద్దా అని సెటైర్‌ వేశారు. తాము గోదావరి పుష్కరాలకు అన్ని సదుపాయాలు కల్పించామని, పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారని, అందుకే జనాలు వచ్చారన్నారు. గోదావరి పుష్కరాల ప్రమాదంపై రోజా మాట్లాడుతూ… నారాయణ ప్రొడక్షన్లో, బోయపాటి డైరెక్షన్లో చంద్రబాబు బలి అని ఎద్దేవా చేశారు. అన్ని అంశాలపైనా చర్చించేందుకు తాము సిద్ధమని పదేపదే చంద్రబాబు, ప్రభుత్వం ఓటుకు నోటు, వనజాక్షిపై దాడి, రిషికేశ్వరి ఆత్మహత్య, నారాయణ కళాశాలల్లో ఆత్మహత్యలు, గుంటూరులో పసిబిడ్డను ఎలుకలు కొరికి చంపిన ఘటనల పైన చర్చకు ఎప్పుడు తెర తీస్తారని ప్రశ్నించారు. అసలు ఈ విషయాల మీద చర్చిస్తారా అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. జగన్ అసెంబ్లీకి కొత్తగా వచ్చాడని బొండ ఉమ చెబుతున్నారని, ఈయనేమైనా అసెంబ్లీకి పదిసార్లు వచ్చాడా అని ప్రశ్నించారు. .
First Published:  31 Aug 2015 9:40 AM IST
Next Story