Telugu Global
Others

ఫోటో నిబంధనతో ఆర్టీఏ కార్యాలయాల్లో రద్దీ

రవాణా శాఖలో కొత్త నిబంధన వాహనదారులతో ఆర్టీఏ కార్యాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటివరకు కేవలం డ్రైవింగ్‌ లైసెన్సుల కోసం వచ్చేవారే ఫొటోలు దిగేవారు. తాజా ఆదేశాల ప్రకారం కొత్త వాహనం కొనుగోలు చేసిన వారు ఎవరైనా సరే రిజిస్ర్టేషన్‌ సమయంలో ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చి ఫొటో దిగాలి. దీనికితోడు ఆర్టీఏలో ఎలాంటి లావాదేవీకైనా ఆధార్‌ కార్డు తప్పనిసరి అనే నిబంధనను అమలు చేస్తున్నారు. ఫొటోలు దిగడానికి, ఆధార్‌కార్డులు చూపించడానికి వస్తున్న వారితో రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ […]

రవాణా శాఖలో కొత్త నిబంధన వాహనదారులతో ఆర్టీఏ కార్యాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటివరకు కేవలం డ్రైవింగ్‌ లైసెన్సుల కోసం వచ్చేవారే ఫొటోలు దిగేవారు. తాజా ఆదేశాల ప్రకారం కొత్త వాహనం కొనుగోలు చేసిన వారు ఎవరైనా సరే రిజిస్ర్టేషన్‌ సమయంలో ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చి ఫొటో దిగాలి. దీనికితోడు ఆర్టీఏలో ఎలాంటి లావాదేవీకైనా ఆధార్‌ కార్డు తప్పనిసరి అనే నిబంధనను అమలు చేస్తున్నారు. ఫొటోలు దిగడానికి, ఆధార్‌కార్డులు చూపించడానికి వస్తున్న వారితో రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కేంద్ర కార్యాలయంగా ఉన్న ఖైరతాబాద్‌ ఆఫీసులో ఈ రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి, ఉప్పల్‌, ఇబ్రహీంపట్నం, అత్తాపూర్‌, మేడ్చల్‌, కూకట్‌పల్లి, మేడ్చల్‌ ఆర్టీఏ కార్యాలయాల్లోనూ రద్దీ ఉంటోంది. ఉదయం 10 నుంచి 2 గంటల వరకే లావాదేవీల సమయం కావడంతో ఈ రద్దీ మధ్యాహ్నం వరకు ఎక్కువగా ఉంటోంది.
First Published:  30 Aug 2015 6:40 PM IST
Next Story